జాజికాయ పొడితో ఆ సామర్థ్యాన్ని పెంచుతుంది. దేనిలో కలిపి తీసుకోవాలో తెలుసుకోండి.
చాలామంది సలాడ్స్ లో కూడా మసాలా దినుసులతో తయారు చేసిన మసాలాలను వినియోగిస్తూ ఉంటారు. మసాలా దినుసులను వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చాలామంది మసాలాలో ఎక్కువగా జాజికాయ పొడిని వినియోగిస్తూ ఉంటారు. ఈ జాజికాయను వినియోగించడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఏర్పడే అజీర్ణం కడుపు ఉబ్బరం వంటి సమస్యలన్నీ సులభంగా దూరమవుతాయి.
అయితే ఈ కాయలో లభించే ‘మిరిస్టిసిన్’ అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. అంతేకాక అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయడానికి జాజికాయ ఉపకరిస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకు ఉంటుంది. జాజికాయ పొడిని సూప్‌లలో వేసి తీసుకుంటే విరేచనాలు, మలబద్దకం, గ్యాస్ తదితర జీర్ణసమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. జాజికాయల పొడిని నిత్యం తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల దంత సమస్యలు పోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పూట భోజనంతో జాజికాయ పొడి తీసుకుంటే రోజూ రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. జాజికాయ పొడిలో కాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. అలాగే రక్త సరఫరా మెరుగు పడుతుంది. దాంపత్య సమస్యలను దూరం చేయడంలో దీనికి మరేది సాటిలేదు.
సెక్స్ సామర్ధ్యాన్ని పెంచడమే కాకుండా వీర్యకణాలను వృద్ధి చేయడంలో సాయపడుతుంది. పురుషుల్లో ఏర్పడే నపుంసకత్వం, శీఘ్ర స్కలనం వంటి లైంగిక సమస్యలను దూరం చేస్తుంది.స్త్రీలకు రుతుక్రమ సమయంలో ఏర్పడే నొప్పులను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనతో బాధపడేవారు తాంబూలంలో జాజికాయ వేసుకుని తినాలి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తింటే ఎంతో ఉపయోగపడతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. జాజికాయ, శొంఠి అరగదీసి కణతలకు పట్టిస్తే తలనొప్పి, మైగ్రేన్ వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
చెంచా తేనెలో చిటికెడు జాజికాయ పొడిని కలిపి పడుకునే ముందు తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. చికెన్ ఫాక్స్ ఉన్నవారు జాజికాయ, జీలకర్ర, శొంఠి పొడుల్ని భోజనానికి ముందు పావు స్పూన్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. మోతాదుకు మించి జాజికాయను ఉపయోగించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలతో పాటు ఏకాగ్రత కోల్పోవడం, ఎక్కువ చెమట పట్టడం.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకని జాజికాయ వాడకంలో కాస్త జాగ్రత్త వహించడం అవసరం. గర్భవతులు దీన్ని ఉపయోగించకుండా చూసుకోవాలి.