Health

వంటింట్లో ఉండే ఈ జీలకర్రని ఇలా చేసి తింటే సకల రోగాలు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మార్కెట్లో రెండు రకాలుగా లభిస్తుంది. మామూలు జీలకర్ర, రెండోది నల్ల జీలకర్ర. ఇది ప్రాచీన కాలం నుండి వాడుకలో ఉంది. మధుమేహం నుండి బరువు తగ్గించడం వరకు అనేక సమస్యలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే అయితే వంటింట్లోనే ఆరోగ్యం ఉంటుందన్న విషయం చాలా మంది గుర్తించడం లేదు. ప్రతిరోజూ వంటకు ఉపయోగించే కొన్ని పదార్థాలు సక్రమంగా తీసుకుంటే కొన్ని పెద్ద వ్యాధుల నుంచి కూడా తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. రోజూ వండే ప్రతీ కూరలో జీలకర్ర తప్పనిసరిగా వేస్తుంటారు. జీలకర్ర రుచికి చేదుగా ఉంటుంది. కానీ దీని ప్రయోజనాలు అమోఘం అనుకోవచ్చు. భోజనం త్వరగా జీర్ణం కావడానికి జీలకర్రను కర్రీలో వాడుతుంటారు.

దీనిని కూరలో మాత్రమే కాకుండా రకరకాల పద్ధతుల్లో తీసుకోవచ్చు. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని ఎక్కువగా వివిధ మార్గాల ద్వారా పిల్లలకు తినిపించడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆడవాళ్లు ఎక్కువగా జీలకర్ర తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. జీలకర్రను నేరుగా తినొచ్చు. అలా ఇబ్బంది అయితే గోరువెచ్చని నీటిలో జీలకర్ర వేసి ఆ నీటిని కాసేపు మరగించాలి.

ఆ తరువాత వాటిని తాగడం వల్ల కడుపుబ్బరం, అజీర్ణ సమస్యలు తొలగిపోతాయి. రక్తహీనత ఉన్నవారు ఇలా చేయడం వల్ల ప్రయోజనంగా ఉంటుంది. జీలకర్ర పొడి, మిరియాల పొడి, యాలకుల పొడి మిక్స్ చేసి వేడి నీటిలో వేసి మరగించిన తరువాత తాగాలి. ఇలా చేయడం వల్ల కడుపులో అల్సర్ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారు సైతం ఇలా తీసుకోవడం వల్ల ఫలితాల ఉంటాయి.

శరీరంలోపలి భాగంలోనే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు రాకుండా జీలకర్ర కాపాడుతుంది. కొబ్బరి నూనెలో జీరలకర్ర పొడి వేసి కొంచెం వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అంటించాలి. గంట సేపటి తరువాత తలస్నానం చేయడం వల్లచుండ్రు సమస్య రాకుండా ఉంటుంది. అలాగే కళ్లు వేడిగా ఉన్నవారు, దురద, ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఆవు పాలల్లో మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి తలకు పట్టించాలి. ఆ తరువాత స్నానం చేయాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker