ఈ జీలకర్ర నీళ్ళు తాగితే మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వు వేగంగా కరిగి బరువు కూడా తగ్గుతారు.
జీలకర్ర వంట రుచి, వాసనను పెంచడమే కాదు, అంతకు మించి అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనతతో పాటు రక్తపోటు, జీర్ణ సమస్యలు, మధుమేహం నియంత్రణ మరియు బరువు తగ్గడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. అయితే జీలకర్రలో థైమాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది ఆహారం జీర్ణమవ్వడానికి అవసరమయ్యే జీర్ణరసాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో సహాయపడతాయి. అలాగే జీలకర్రను తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ చాలా సులభంగా కరిగిపోతుంది.
జీలకర్రలో ఉండే థైమో క్వినోన్ అనే రసాయన సమ్మేళనం కాలేయాన్ని ఉత్తేజపరిచి శరీరంలో జీవక్రియల రేటును పెంచుతుంది. దీంతో కొవ్వు కణాల్లో ఉండే కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది. కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండడం వల్ల ఇన్ ప్లామేషన్ రావడంతో పాటు క్రమంగా ఇన్సులిన్ నిరోధకత వచ్చి షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కనుక శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న వారు జీలకర్రను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను చాలా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.
జీలకర్రను రెండు గ్రాముల మోతాదులో 8 వారాల పాటు తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అలాగే ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. జీలకర్రను లేదా జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యనుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ నీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. అలాగే జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
అయితే జీలకర్రను మనం ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాము. నూనెలో వేసి వేయించడం వల్ల జీలకర్రలో ఉండే రసాయనాలు, యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కనుక సాధ్యమైనంత వరకు జీలకర్ర నీటిని తీసుకోవడానికే ప్రయత్నించాలి. జీలకర్రను నీటిలో వేసి 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ నీటిని మరిగించి వడకట్టాలి. ఈ నీటిని మనం తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరిగిస్తాము కనుక జీలకర్రలో ఉండే పోషకాలు నశించకుండా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
ఈ జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. సులభంగా బరువు తగ్గవచ్చు. షుగర్ వ్యాది అదుపులో ఉంటుంది. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ విధంగా జీలకర్ర నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరూ తప్పకుండా ఈ జీలకర్ర నీటిని తీసుకోవాలని ముఖ్యంగా ఊబకాయంతో బాధపడేవారు ఈ నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.