రూమ్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు, యాసిడ్ పోస్తానని బెదిరించాడు: నటి జయలలిత
నటి జయలలిత..నేను మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి కూచిపూడి నృత్యం పట్ల ఆసక్తిని పెంచుకుంటూ .. నేర్చుకుంటూ వెళ్లాను. వెయ్యికిపైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. గుంటూరు కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను .. అప్పటికే అందాల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాను. నా నాట్య ప్రదర్శనలే నాకు సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టాయి అని అన్నారు.
అయితే జయలలిత మాట్లాడుతూ.. ‘నేను అత్యధికంగా లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నా. ఇంద్రుడు చంద్రుడు సినిమాకు రామానాయుడు ఇచ్చారు. అంత మంచి క్యారెక్టర్ ఏ సినిమాలోనూ రాలేదు. నా రెమ్యునరేషన్ గురించి అంతా మా నాన్నే. డేట్స్ కూడా చూసుకునేవారు. బాలయ్య, చిరంజీవితో సినిమాలు చేశా. బాలయ్య చాలా సరదాగా మాట్లాడేవారు. చిరంజీవి కూడా ఎప్పుడు కనిపించినా అప్యాయంగా పలకరించేవారు.
సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల్లో ఇబ్బందులు ఉంటాయి. నాకు సెట్‌లో టైంకు భోజనం పెట్టకపోతే నిర్మాతకు శాపం పెడతా.’ అంటూ చెప్పుకొచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ అసభ్యంగా..అసిస్టెంట్ డైరెక్టర్ తీరు గురించి మాట్లాడుతూ..’ ఓ మలయాళం మూవీ చేసేటప్పుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు మలయాళం భాష రాదు. అప్పుడు మలయాళంలో సినిమా చేసేందుకు ఫస్ట్ టైమ్ వెళ్లా.
అందులో రేప్ సీన్ గురించి చెప్పాలని గదిలోకి రమ్మన్నారు. లోపలికి వెళ్లాకా అసిస్టెంట్ డైరెక్టర్ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కానీ ఆ తర్వాత అతను ఆరు నెలల్లోనే చనిపోయాడు. అతనెలా చచ్చాడో కూడా నాకు తెలియదు.’ నటి జయలలిత చెప్పుకొచ్చారు. అంతే కాకుండా చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ సినిమాలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్నట్లు జయలలిత తెలిపారు.
వ్యాంప్ పాత్రల వల్లే కారణంగానే ఆ ఛాన్స్ పోయిందన్నారు. అంతేకాకుండా కళాతపస్వి కే. విశ్వనాథ్ బంధువుతో పెళ్లి సంబంధం కూడా పోయిందని.. కుటుంబం కోసమే వద్దకు వచ్చిన పాత్రలన్నీ చేసినట్లుగా జయలలిత వెల్లడించారు.