ఆ విషయం తెలిసి శోభన్ బాబు ని దారుణంగా అవమానించిన జయలలిత తల్లి.
అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో శోభన్ బాబును మించిన అందగాడు లేడు. ఆ రోజుల్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకు లేదు. ఎంతో మంది అమ్మాయిలకు శోభన్ బాబు నిద్రలేకుండా చేశాడు. అలాంటి సోగ్గాడికే నిద్రలేకుండా చేసింది జయలలిత. అప్పట్లో జయలలిత అంటే శోభన్ బాబుకు ఏదో తెలియని వ్యామోహం ఉండేది. ఆమెతో కలిసి నటించాలని దాదాపు 8 ఏళ్లు ఎదురు చూశాడని అంటుంటారు. అయితే శోభన్ బాబు సినిమాలు అంటే అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా చూసేవారు.
అందులో భాగంగానే సోగ్గాడు, గోరింటాకు లాంటి సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచాయి.ఈ సినిమాలకి ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మ రథం పట్టారు.అలాంటి శోభన్ బాబు గారిని ఒకప్పటి స్టార్ హీరోయిన్ అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయలలిత గారి అమ్మగారు ఆయనని ఎలా అవమానించారు అనేది తెలుసుకుందాం. శోభన్ బాబు ఇండస్ట్రీ లో హీరో గా ఎదుగుతున్న క్రమంలో జయలలిత తమిళంలో ఒక్క ఎంజీఆర్ తోనే 5 సంవత్సరాలలో 32 సినిమాల్లో నటించి నటి గా మంచి గుర్తింపు పొందింది.
అలాంటి క్రమంలో శోభన్ బాబు మీడియం రేంజ్ హీరోగా ఉన్నాడు. ఒక సినిమా లో శోభన్ బాబు కి జోడీ గా జయలలిత ని తీసుకుందాం అని మేకర్స్ అనుకున్నారు. కానీ అప్పటికే తమిళం లో జయలలిత స్టార్ హీరోయిన్ గా ఉంది. కాబట్టి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయను అని చెప్పినట్టుగా తెలిసింది. దాంతో శోభన్ బాబు చాలా బాధపడ్డడట దాంతో అప్పటినుంచి ఆయన ఏ సినిమా చేసిన అందులో జయలలితని హీరోయిన్ గా పెట్టుకొని ఒక సినిమా అయిన చేయాలి అని అనుకునేవాడు.
అయితే శోభన్ బాబుతో సినిమా చేయను అని జయలలిత చెప్పలేదు అప్పుడు జయలలిత డేట్స్ వాళ్ళమ్మ అయిన సంధ్య గారు చూసేవారు కాబట్టి ఆమెనే జయలలిత శోభన్ బాబు తో సినిమా చేయదు అని చెప్పిందట.