అర్ధరాత్రి స్టార్ హీరోయిన్ అపార్ట్మెంట్‌లో ఫైర్ యాక్సిడెంట్, భారీగా వ్యాపించిన మంటలు.
నిన్న అర్ధరాత్రి జాక్వెలిన్ ఉండే అపార్ట్మెంట్ లోని 14వ ఫ్లోర్ లోని ఓ వంటింట్లో మంటలు ఎగిసిపడ్డాయి. బయట నుంచి చూసిన కొంతమంది ఫైర్ ఇంజిన్ కి కాల్ చేయడంతో 4 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకొని మంటలను ఆర్పాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదని సమాచారం. అయితే నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలోని బాంద్రాలోని పాలి హిల్‌లోని నవ్రోజ్ హిల్ సొసైటీ అపార్ట్‌మెంట్ భవనంలో బుధవారం మంటలు చెలరేగాయి.
మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్ చేయండి.
సమాచారం అందిన వెంటనే నాలుగు అగ్నిమాపక యంత్రాలు, మూడు జంబో ట్యాంకర్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఈ బిల్డింగ్ లో 17 అంతస్తులు ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. 14వ అంతస్థులోని ఒక వంట గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇదే భవనంలో 15వ అంతస్థులో నివసిస్తున్నారు. ఆమెకు 5 బిహెచ్‌కె ఇల్లు ఉంది. 2023లో జాక్వెలిన్ ఇక్కడ ఇల్లు కొనుక్కుంది.
మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్ చేయండి.
గతేడాది జులైలో ఆమె తన ఇంటి వీడియో వైరల్‌గా మారింది. ఈ భవనంలో చాలా మంది వ్యాపారవేత్తలు, ప్రముఖులు నివసిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, రణబీర్ కపూర్, అలియా భట్ అలాగే మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ ఇక్కడ పక్కపక్కనే నివసిస్తున్నారు. ఈ భవనానికి సమీపంలోనే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇల్లు కూడా ఉంది. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె కూడా ఇదే ప్రాంతంలో ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నారు.
మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్ చేయండి.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అక్కడ ఓ యాక్షన్ సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ సెట్‌లోని ఓ ఫోటోను షేర్ చేసి వార్తల్లో నిలిచారు. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. అలాగే రూ.200 కోట్ల మోసం కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధాల వల్ల జాక్వెలిన్ ఈ మధ్య వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.