పాతికేళ్లకు ఆ కోరిక తీర్చుకున్న రష్మిక, ఆ అనుభూతి అద్భుతం అంటూ..!
సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన నటన, అందంతో అభిమానుల హృదయాలను సంపాదించుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం జపాన్‌లో ఎంజాయ్ చేస్తోంది. రష్మిక చాలా స్టైలిష్ అండ్ వండర్ ఫుల్ లుక్‌లో కనిపించింది. రష్మిక మందన్న లేటెస్ట్ జపాన్ ఫొటొలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఇందులో ఆమె గ్లామరస్ లుక్స్ తో నెటిజన్లను ఆకర్షిస్తోంది. అయితేకూర్గ్ అందం రష్మిక మందన్న తాజాగా జపాన్ వెళ్లిందట.
అయితే జపాన్ను ఎప్పటినుంచో చూడాలనీ, వెళ్లాలనీ అనుకున్నా.. కుదరలేదట. ఇన్నాళ్లకు ఆమె కోరిక ఇలా తీరిందని.. తన ఇన్‌స్టా్గ్రామ్‌లో ఓ ఏమోషనల్ పోస్ట్ పంచుకుంది. ఆమె అక్కడ అనిమే క్రియేటర్స్‌కు అవార్డ్స్ కూడా అందజేసిందట. అంతేకాదు జపాన్ ప్రజలు ఎంతో ఆప్యాయంగా ఆమెను రిసీవ్ చేసుకున్నారట. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ కన్నడ అందం రష్మిక తాజాగా ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. 2024 యంగ్ డిస్ట్రప్టర్స్, ట్రైల్బ్లేజర్స్ కేటగిరిలో ఈ భామ చోటు దక్కించుకున్నట్లు ఫోర్బ్స్ ఇండియా తాజాగా ప్రకటించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే… రష్మిక పాటు పుష్ప2 : ది రూల్ – 15 ఆగస్టు విడుదల కానుంది.
VD12 – విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమా, D51 – ధనుష్ & శేఖర్ కమ్ముల సినిమా, రవితేజ- గోపీచంద్ మలినేని సినిమా, రెయిన్బో – లేడీ ఓరియెంటెడ్ మూవీ, ఇక లేటెస్ట్గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ.. ఈ సినిమాను GA2 పిక్చర్స్ నిర్మిస్తోంది.