ఈ పౌడర్ రోజు కొంచం తింటే షుగర్ వ్యాధి మటుమాయం.
పనసపొట్టుతో బిర్యానీలు చేసుకుని తింటే.. నాన్ వెజ్ తిన్నట్లే ఉంటుంది. అయితే ఆ పనసపొట్టును ఎండపెట్టి పొడి చేసుకుని తీసుకుంటే.. అది షుగర్ పేషెంట్స్ కు నెంబర్ వన్ గా పనిచేస్తుంది అంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయట. అయితే కొచ్చి పరిశోధకులు కొత్త అధ్యయనంలో పనస పొట్టు డయాబెటిస్ రోగులలో బ్లడ్ షుగర్ గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ (HbA1c) తగ్గుతుందని కనుగొన్నారు.
డయాబెటిస్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ రోగులలో గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియ వేగాన్ని మెరుగుపరుస్తుంది. పనస పండు యొక్క 12 విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహం లేదా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ని నివారిస్తుంది.
ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఇందులోని అధిక పొటాషియం కంటెంట్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక యాంటీ ఆక్సిడెంట్ మరియు ఫ్లేవనాయిడ్ కంటెంట్ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఇది రక్తహీనతను నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. గ్లూటెన్ రహిత ఆహారం గోధుమ లేదా బియ్యంతో పోలిస్తే అధిక స్థాయిలో కరిగే ఫైబర్ ఉంటుంది.
ఇక కార్బోహైడ్రేట్ మరియు కేలరీలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పనసపొట్టులో క్యాన్సర్‌ను నయం చేసే గుణాలు కూడా ఉన్నాయి. జాక్‌ఫ్రూట్ పిండిని మైదాకు బదులుగా కేకులు మరియు కుకీలు వంటి బేకింగ్ ఐటమ్స్‌లో ఉపయోగించవచ్చు.