ఆ లోపం ఉంటే గర్భం ధరించడం కష్టమేనా..?
శరీరంలో అయోడిన్ లోపిస్తే అది జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది. మెదడు ఎదుగుదల తగ్గి బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది. థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా విడుదల కాకపోతే గాయిటర్ అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఉప్పు అధికంగా తినడం వల్ల హైబీపీ వంటి సమస్యలు వస్తాయని, హైబీపీ వల్ల ప్రధాన అవయవాలు దెబ్బతింటాయని చెబుతున్నారు వైద్యులు. ఉప్పు తగ్గిస్తే మరి అయోడిన్ సంగతి? అప్పుడు అయోడిన్ లోపం వస్తుంది కదా? అని ఎంతో మంది సందేహం.
అయోడిన్ లోపం రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకునే ముందు అయోడిన్ మనకు ఎందుకు అత్యవసరమో తెలుసుకోవాలి. అయోడిన్ లోపిస్తే…హార్మోన్ల పనితీరుకు థైరాయిడ్ చాలా ముఖ్యం. థైరాయిడ్ పనితీరు బావుండాలంటే అయోడిన్ అనే సూక్ష్మ పోషకం అవసరం. అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ సరిగా పనిచేయలేదు. దీనివల్ల హైపో థైరాయిడిజం అనే సమస్య మొదలవుతుంది. ఈ సమస్య బారిన పడిన స్త్రీలు గర్భం ధరించడం కష్టం అవుతుంది. హైపో థైరాయిడిజం సమస్యకు రోజూ మందులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
అందుకే అయోడిన్ లోపిస్తే పిల్లలు కనడం కష్టంగా మారుతుంది. రోజుకెంత అవసరం. గర్భం ధరించే వయసులో ఉన్న స్త్రీలకు రోజుకు 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గర్భం ధరించిన స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు అయోడిన్ ఎక్కువ అవసరం. ఎవరైతే రోజుకు 50 మైక్రో గ్రాముల కన్నా తక్కువ తీసుకుంటారో వారు అయోడిన్ లోపం బారిన పడతారు. అంటే పిల్లలు కలగడం కష్టంగా మారుతుంది. ఆహారం ద్వారా తీసుకున్న అయోడిన్… గర్భాశయంలోని అండాశయాలు, ఎండోమెట్రియం పొర గ్రహిస్తాయని ఓ కొత్త పరిశోధన చెప్పింది.
పరోక్షంగా అండోత్సర్గాన్ని ప్రోత్సహిస్తుంది అయోడిన్. పురుషుల్లో కూడా…థైరాయిడ్ సమస్య అనగానే అందరూ చూపు స్త్రీలపైనే పడుతుంది కానీ, పురుషులకు కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అయోడిన్ లోపం పురుషులలో అవసరమైన స్థాయిలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో విఫలం అవుతుంది. దీనివల్ల గర్భం ధరించడం కష్టమవుతుంది. అయోడిన్ అధికంగా తీసుకుంటే మాత్రం అంగస్తంభన , స్పెర్మాటోజెనిక్ అసాధారణతలు, స్పెర్మ్ చలనశీలత సమస్యలు, తక్కువ స్పెర్మ్ చలనశీలత వంటివి కలుగుతాయి.