Health

ఇంగువ గురించి బామ్మ చెప్పిన చిట్కాలు, నపుంసకత్వాని కూడా..?

ఒక అరకప్పు నీటిలో చిన్నచిన్న కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే అజీర్తి, ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కల్గుతుంది. స్త్రీలకు సంబంధించిన రుతు సంబంధ సమస్యలు నొప్పి, తిమ్మిరి, వంటి వాటికి ఇంగువ చక్కగా పని చేస్తుంది. అయితే భారతీయులు తమ వంటకాల్లో తప్పకుండా ఇంగువ వేసుకుంటారు. దీన్నే హింగ్ లేదా ఆసఫోటిడా అని కూడా పిలుస్తారు. జీర్ణక్రియ ప్రక్రియని సులభతరం చేయడానికి ఇంగువ తప్పనిసరిగా వినియోగిస్తారు. ఇంగువలో అనేక ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. తీవ్రమైన మైగ్రేన్ నొప్పిని తగ్గించగలదు.

పాము కాటు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ఇది కీటక వికర్షకంగా కూడా పని చేస్తుంది. ఇంగువ వల్ల ఉన్న ప్రయోజనాలు. శిశువుల కడుపులోని గ్యాస్ తొలగిస్తుంది.. పాలు తాగే శిశువుల్లో గ్యాస్ చేరి పొట్ట ఇబ్బంది పెడుతుంది. నోరు తెరిచి చెప్పలేక ఏడుస్తూ ఉంటారు. మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు వెంటనే పిల్లలకి పొట్ట మీద ఇంగువ నీళ్ళు రాస్తారు. ఇలా చేయడం వల్ల గ్యాస్ నుంచి తక్షణమే ఉపశమనం పొందుతారు. హాయిగా నిద్రపోతారు.

ఒకటి లేదా రెండు స్పూన్ల గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ మిక్స్ చేసి యాంటీ క్లాక్ వైజ్ మోషన్ లో శిశువు పొట్ట మీద అప్లై చేయాలి. ఇది వాళ్ళకి మంచి రిలీఫ్ ఇస్తుంది. శ్వాసకోశ రుగ్మతలు నయం చేస్తుంది.. ఇంగువలో యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయి. ఉబ్బసం, పొడి దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలని చికిత్స చేయడానికి సహాయపడుతుంది. జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందటానికి 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి, 2 టేబుల్ స్పూన్ల శొంఠి తీసుకుని తేనె వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2-3 సార్లు తీసుకుంటే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

పంటి నొప్పి తగ్గిస్తుంది.. పుచ్చిన పన్ను నొప్పిగా ఉన్నప్పుడు ఇంగువ పెట్టుకుంటే కాసేపటికే రిలీఫ్ వస్తుంది. నొప్పిగా ఉన్న పన్ను పక్కన చిగుళ్ళపై కొద్దిగా ఇంగువ ఉంచుకుంటే సరిపోతుంది. నొప్పి తగ్గే వరకు రోజుకు 2-3 సార్లు ఈ రెమిడీ అనుసరించవచ్చు. తలనొప్పి మటుమాయం.. తలనొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 1-2 కప్పున నీటిని తీసుకుని బాగా వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా ఇంగువ వేసి 10-15 నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ నీటిని రోజంతా తాగుతూ ఉండాలి. తీవ్రమైన తల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. శొంఠి, కర్పూరం, మిరియాలు సమాన పరిమాణంలో తీసుకోవాలి.

ఈ పొడులన్నింటిని రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. మైగ్రేన్ నుంచి తక్షణ ఉపశమనం పొందేందుకు ఈ పేస్ట్ ని కనుబొమ్మల మధ్య రాసుకుని ఉంచుకుంటే చక్కని ఫలితం పొందుతారు. నపుంసకత్వానికి చికిత్స.. పురుషులలో నపుంసకత్వాన్ని నయం చేయగల సామర్థ్యం ఇంగువకి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. చిటికెడు ఇంగువ నెయ్యిలో వేసి వేయించాలి. అందులో 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ మర్రి చెట్టు రబ్బరు పాలు కలపాలి. నపుంసకత్వానికి చికిత్స చేయడానికి ఈ మిశ్రమాన్ని సూర్యోదయానికి ముందు 40 రోజులు క్రమం తప్పకుండా తినాలి. పాము కాటు నుంచి రక్షిస్తుంది.. విషపూరిత కీటకాలు, పాము కాటు నుంచి రక్షించడంలో కూడా ఇంగువ సహాయపడుతుంది. ఈ పౌడర్ ని నీళ్ళతో కలిపి పాము కాటు వేసిన చోట అప్లై చేయాలి. ఆరిపోయిన తర్వాత దాన్ని శుభ్రం చేసుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker