రఘువరన్ చనిపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా..?

రఘువరన్ చనిపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా..?

చిత్రరంగంలో బాగా విజయవంతమైనా ఆయన మాదకద్రవ్యాలకు, మద్యానికి బానిస కావడంతో జీవితం ఒడిదుడుకులకు గురైంది. రఘువరన్ మార్చి 19, 2008 న చెన్నైలో గాఢ నిద్రలో ఉండగానే గుండెపోటుతో మరణించాడు. దీర్ఘకాలం మద్యం సేవించడం వలన ఆయన కాలేయం కూడా దెబ్బతిన్నది. చనిపోవడానికి కొద్దిరోజులకు ముందు ఆయన నిద్రలో ఉండగా చనిపోయే సన్నివేశంలో నటించడం యాదృచ్ఛికంగా జరిగింది. అయితే 1986లో మిస్టర్ భరత్ అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఇక ఆ తర్వాత చైతన్య, న్యాయానికి సంకెళ్ళు, పసివాడి ప్రాణం, జేబుదొంగ, కాంచన సీత, శివ, అంజలి ,కిల్లర్, ప్రేమికుడు, ముత్తు, ఎవడైతే నాకేంటి, ఒకే ఒక్కడు , రక్షకుడు, అరుణాచలం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇలా తెలుగు ,తమిళ్ ,కన్నడ, మలయాళం భాషలలో సుమారు 150 చిత్రాలకు పైగా నటించారు. ఆ తరువాత ఈయన నటి రోహిణి ని పెళ్లి చేసుకొని, వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు.

అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈయన చివరిసారిగా 2008లో వచ్చిన నితిన్ ఆటాడిస్తా మూవీ తో సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇక ఈయన సినీ కెరీర్లో ఇదే చివరి సినిమా. ఈయన చిత్రాలలో బాగా విజయవంతంగా రాణిస్తున్న సమయంలో ,ఈయన అనుకోని కారణాల చేత మద్యానికి.. మాదకద్రవ్యాలకు .. ఇలా ఎన్నో చెడు అలవాట్లకు బానిస అయ్యారు. ఈయన మద్యానికి బానిస కావడం వల్ల కాలేయం కూడా చెడిపోయింది. మార్చి- 19 – 2008 లో చెన్నై లో గాఢనిద్రలో ఉన్నట్టుగానే గుండెపోటుతో మరణించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *