ఈ కాలంలో వీటిని తింటే రక్తంలో వేగంగా ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.
ప్లేట్ లెట్స్ ఎముక మూలగ నుండి పుడతాయి. వీటి జీవితకాలం నాలుగ రోజులు. ఎముక మూలగలో ఏదైన సమస్య ఉత్పన్నమయ్యే సందర్భంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతుంది. ఇది సాధారణంగా జరిగేదే. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిన సందర్భంలో రక్తం గడ్డగట్టే ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. అయితే ర్షాకాలంలో వైరల్ ఫీవర్లు. అందులో డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ప్లేట్‌లెట్ సంఖ్య పడిపోయింది.
చాలా డేంజర్ అంటూ హడావిడి. అవి పెరిగే వరకు హాస్పిటల్ నుంచి బయటకు రావడానికి ఉండదు. మరి అందాకా రాకుండా ఉండాలంటే ప్లేట్‌లెట్ల సంఖ్యను సహజ పద్దతిలో పెంచుకోవాలంటే ఈ ఫుడ్ తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొప్పాయి ఆరోగ్యానికి మంచిది. పండిన బొప్పాయి ముక్కలు రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్త హీనత సమస్య ఉండదు. బొప్పాయి ఆకులు ప్లెట్‌లెట్ల సంఖ్య పెరగడానికి దోహద పడతాయి.
ఈ ఆకుల్ని నీటిలో వేసి మరగబెట్టి ఆ నీటిని చల్లారాక తాగాలి. ఇలా రోజుకి రెండు సార్లు చేస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య త్వరగా పెరుగుతుంది. ఇదే విషయాన్ని మలేషియాలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్ధారించారు. అలాగే ఓ కప్పు గోధుమ గడ్డి జ్యూస్‌లో 3 చుక్కల నిమ్మరసం కలిపితాగినా చక్కటి ఫలితం ఉంటుంది. దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. రోజూ తీసుకుంటే రక్త కణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
దీంతో పాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ, నారింజ, బచ్చలికూర తింటే రక్త కణాల సంఖ్య వృద్ధి చెందుతుంది. ప్టేట్‌లెట్ల సంఖ్య పెంచడంలో ఉసిరి పాత్ర కూడా అమోఘం. రోజూ ఉదయాన్నే పరగడుపున ఉసిరి జ్యూసులో తేనె కలిపి తాగితే మంచిది. రక్తహీనత ఉన్నవారికి బీట్‌రూట్ అద్భుతంగా పని చేస్తుంది. వారానికోసారి బీట్‌రూట్ జ్యూస్ తాగితే బ్లడ్‌లోని ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో తయారు చేసిన వంటల ద్వారా కూడా రక్తకణాల సంఖ్యను పెంచుకోవచ్చు.