ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారా..? మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?
రోగ నిరోధ వ్యవస్థ జీవుల శరీరానికి రక్షణ వ్యవస్థ. దీనిని అసంక్రామ్య వ్యవస్థ అని కూడా పిలుస్తారు. దీనిలో తెల్ల రక్తకణాలు, ప్రతిదేహాలు, కొన్ని చిన్న అవయవాలు కలిసి ఒక బలగంగా పనిచేసి శత్రువులతో నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని రక్షిస్తున్నాయి. అయితే కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కొత్త కొత్త రోగాలు ప్రజలను పట్టిపీడిస్తూనే ఉన్నాయి. కంటికి కనిపించని కరోనా వైరస్ తో ఎంతోమంది చనిపోయారు. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలను ఫేస్ చేస్తున్నవారున్నారు.
ఈ మధ్యకాలంలో మంకీపాక్స్, ఎబోలా, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధుల కేసులు కూడా పెరిగిపోతున్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఈ రోగాల నుంచి బయటపడటానికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ రోగనిరోధక శక్తి మీ రోగాన్ని ట్యాబ్లెట్లు వాడకుండానే తొందరగా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని ఎలాంటి ఆహారాలు పెంచుతాయో తెలుసుకుందాం. బెర్రీలు..సాధారణంగా పండ్ల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ ఆపిల్, నారింజ, ద్రాక్ష మొదలైన వాటినే ఎక్కువగా తింటుంటారు. కానీ మన ఆరోగ్యానికి బెర్రీలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల మెదడు పనితీరు బాగుంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
క్యాన్సర్ ముప్పు కూడా ఉండదు. బెర్రీలలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యానికి సహాయపడతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బచ్చలికూర..బచ్చలికూరలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ కూర మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్కె, ఇనుము, ఫోలేట్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి..వెల్లుల్లిని ప్రతికూరలో వేస్తారు. వెల్లుల్లి ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీనిలోని పదార్ధం మంటను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. బాదం..బాదం పపుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ పప్పులు శరీర మంటను తగ్గిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాదు ఈ పప్పులు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. బాదం పప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కణాల నష్టం, వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.పొద్దుతిరుగుడు విత్తనాలు..పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా తప్పుతుంది.