కుమార్తె మరణంతో ఏడిపిస్తున్న ఇళయరాజా పోస్ట్. ఆయుర్వేద చికిత్స కూడా..
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె భవతారిణి (47) గురువారం శ్రీలంకలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న భవతారిణి శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. 1995లో ప్రభుదేవా నటించిన రసయ్య అనే తమిళ చిత్రంలో ‘పెప్పి మస్తానా.. మస్తానా..’ అనే పాట ద్వారా గాయనిగా కెరీర్ ప్రారంభించిన భవతారిణి వందలాది పాటలు పాడారు.
ఇక భవతరణి మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, ఇళయరాజా అభిమానులు ఆమెకు సంతాపం ప్రకటించారు. ముఖ్యంగా విశాల్.. చాలా ఎమోషనల్ అయిన విషయం కూడా తెల్సిందే. ఇక తాజాగా కూతురును తలుచుకొని ఇళయరాజా కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆమె చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ.. జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇళయరాజా హెడ్ ఫోన్స్ పెట్టుకొని.. పక్కనే ఉన్న భవతారణికి పుస్తకంలో ఉన్న ప్రముఖులను పరిచయం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇక ఈ ఫొటోకు క్యాప్షన్ గా డియర్ డాటర్ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కూతురు జ్ఞాపకాలతో ఇళయరాజా ఎంత కుంగిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ఫోటో చాలు.. తండ్రీకూతుళ్ళు ఎలా ఉండేవారో తెలుస్తోందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక భవతరిణి గురించి చెప్పాలంటే.. ఆమెకు గాయనిగా కోలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది.
2000 సంవత్సరంలో వచ్చిన భారతి అనే సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా.. ఆ సినిమాలో మాయిల్ పోలా పొన్ను ఒన్ను అనే పాటను భవతరిణి పాడింది. ఈ పాటతో ఆమె నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఫ్రెండ్స్, పా, టైమ్, ఒరు నాళ్ ఒరు కనవు, అనెగన్ తదితర చిత్రాల్లో పలు పాటలు పాడి మెప్పించింది. ఫిర్ మిలేంగే, ఇలక్కనమ్, వెల్లాచి, అవునా తదితర సినిమాలకు సంగీత దర్శకురాలిగా వ్యవహరించారు. చివరగా 2019లో వచ్చిన మాయానది అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకురాలిగా పనిచేసింది.
அன்பு மகளே… pic.twitter.com/GgtnKGyvQ1
— Ilaiyaraaja (@ilaiyaraaja) January 26, 2024