News

తల్లి కాబోతున్న ఇలియానా, ఆ బేబీకి తండ్రెవరో తెలుసా..?

పెళ్లి ఊసేలేకుండా ఏకంగా గర్భవతి అనే విషయం తెలియడంతో అందరి మైండ్‌ బ్లాంక్‌ అయింది. ఇంతలో తాజాగా మరో వీడియో షేర్ చేసి షాకిచ్చింది ఇల్లీ బేబీ. తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలియానా పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి పలువురు నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే మీ పెళ్ళెప్పుడు జరిగింది మేడం? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అని అడిగేవారు మాత్రం చాలా మందే ఉన్నారు. ఏదేమైనా ఇలియానా ప్రెగ్నన్సీ ఇష్యూ ఇప్పుడు జనాల్లో చర్చనీయాంశం అయింది.

అయితే తెలుగులో మంచి క్రేజ్ లభించిన తర్వాత హిందీలో కూడా అడుగుపెట్టిన ఆమె అక్కడ కూడా అనేక హిట్ సినిమాల్లో భాగమై మంచి పేరు సంపాదించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు పీక్ లో ఉన్న టైంలోనే బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టి అక్కడికి షిఫ్ట్ అయింది ఈ భామ. అలా బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత ఒక విదేశీయుడితో ప్రేమలో పడి చాలా కాలం పాటు బాలీవుడ్ సినిమాలతో పాటు అన్ని సినిమాలకు దూరమై పూర్తిగా ప్రేమ మత్తులోనే మునిగిపోయింది. ఆ తర్వాత అతనితో బ్రేకప్ అయ్యాక మళ్ళీ సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేసినా ఆమె ఏ మాత్రం అవకాశాలు అందుకోలేక పోయింది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లు, వీడియోలు షేర్ చేస్తూ వస్తున్న ఈ భామ కొద్ది రోజుల క్రితం తల్లి కాబోతున్న అని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. రెండు వారాల క్రితం తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని చెబుతూ ఒక చిన్నారి డ్రెస్సును అలాగే తన మెడలో మా మమ్మ అని రాసి ఉన్న ఒక లాకెట్ ఫొటోస్ షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దానికి కారణం ఆమెకు ఇంకా వివాహం కాకపోవడమే.

ఇలా పెళ్లి కాకుండా తల్లి కావడమేమిటి అని అందరూ ఆసక్తికరంగా అనేక రకాల కామెంట్లు కూడా పెట్టారు. అయితే ఇదేదో సినిమా ప్రమోషన్స్ కోసమే ప్లాన్ చేసినట్టు ఉందని అందరూ భావించారు. అయితే ఈ విషయం ఇప్పుడు మరుగున పడిపోయింది కానీ తాజాగా ఆమె తన బేబీ బంప్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఆమె తల్లి కాబోతుందని విషయం ఈ బేబీ బంప్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. అయితే ఆమెకు వివాహం కాలేదు కదా మరి తల్లి ఎలా అవుతుంది? ఆమె బిడ్డకు తండ్రి ఎవరు? అంటూ రకరకాల కామెంట్లు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఇలియానా ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ అండ్రూతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసింది. చాలాకాలం పాటు సహజీవనం కోసం కూడా చేసిన ఈ జంట 2019లో విడిపోయారు. ఆ తర్వాత సినిమాల్లో మరోసారి బిజీ అవ్వాలని ప్రయత్నం చేసిన ఇలియానా ఎందుకో మొదటిసారి సక్సెస్ అయినంత బాగా రెండవ సారి సక్సెస్ అవ్వలేకపోయింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker