ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం, అసలు ఏం జరిగిందో తెలుసా..?
ఇళయరాజా సంగీత ప్రయాణానికి అతని అన్నయ్య పావాలార్ వరదరాజన్ ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన 1973లో కన్నుమూశారు. వరదరాజన్ కు ఇద్దరు కుమారులు కాగా ఒకరు 2020లో కిడ్నీ సమస్యతో మరణించగా.. తాజాగా మరో కుమారుడు తుదిశ్వాస విడిచారు. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ఆయన అన్నయ్య భావలార్ వరదరాజన్ కొడుకు పావలర్ శివన్ (60) కన్నుముశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శివన్. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఇళయరాజా.. ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మనిగిపోయారు. పావలర్ శివన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
పావలర్ శివన్ తన కుటుంబంతో కలిసి పుదుచ్చేరిలో నివసించేవారు. ఆయన ఫేమస్ గిటారిస్ట్. కొన్ని సంవత్సరాలుగా ఇళయరాజా సంగీత బృందంలో గిటారిస్ట్ గా పనిచేస్తున్నారు. ఇళయరాజా సంగీత ప్రయాణానికి అతని అన్నయ్య పావాలార్ వరదరాజన్ ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన గేయ రచయిత మాత్రమే కాకుండా సంగీత విద్వాంసుడు.
ఇళయరాజా అన్నయ్య పావలర్ వరదరాజన్ 1973లో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఒకరు 2020లో కిడ్నీ సమస్యతో మరణించగా.. మరో కుమారుడు పావలర్ శివన్ మే 2న అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. పావలర్ శివన్ రెండు, మూడు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు.
ఈరోజు పావలర్ శివన్ అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. శివ అంత్యక్రియలలో ఇళయరాజా, యువంశంకర్‌రాజా, కార్తీకరాజా, గంగై అమరన్, వెంకట్ ప్రభు, ప్రేమ్‌జీ అమరన్, భవధరణి పాల్గొననున్నట్లు సమాచారం.