గుండె నొప్పితో షూటింగ్లోనే కుప్పకూలిన స్టార్ హీరో, వైద్యులు ఏమంటున్నారంటే..?
బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. మిథున్ గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. సుమారు రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఛాతీ వద్ద నొప్పి రావడంతో ఆయన కోల్‌కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ప్రముఖ నటి దేవశ్రీ రాయ్ ఆసుపత్రికి వెళ్లి మిథున్ చక్రవర్తి ఆరోగ్యంపై ఆరా తీశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పుడు మిథున్ చక్రవర్తి ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన షుగర్ లెవెల్ తగ్గింది. ప్రస్తుతం ఐసీయూ నుంచి మరో వార్డుకు మిథన్‌ను తరలించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరగవుతోంది’ అని దేవశ్రీ తెలిపారు. ప్రముఖ దర్శకుడు పతిక్రిత్ బసు కూడా మిథున్ చక్రవర్తిని కలుసుకుని మాట్లాడారు. వీలైనంత త్వరగా కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటానని మిథున్ చక్రవర్తి హామీ ఇచ్చారని బసు తెలిపారు.
మిథున్ చక్రవర్తి 1976 నుంచి సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్నారు. ‘డిస్కో డాన్సర్’, ‘జంగ్’, ‘ప్రేమ్ ప్రతిజ్ఞ’, ‘ప్యార్ జుక్తా నహీ’, ‘మర్ద్’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే 2024 సంవత్సరానికి గాను ఆయనకు ‘పద్మభూషణ్’ అవార్డు లభించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే మిథన్ తీవ్ర అనారోగ్యానికి గురికావడం అభిమానులను ఆవేదనకు గురిచేసింది.
BREAKING: PM @narendramodi dials #MithunChakraborty, inquiring about his health. https://t.co/MPrYMLT0J1
— Sai Ram B (@SaiRamSays) February 11, 2024