News

హైదరాబాద్ OYO రూమ్ లో ప్రియుడితో భార్య, సడెన్ గా భర్త రావడంతో..!

పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకునే ప్రేమ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తున్న ఈ తరం దంపతుల పోకడ పాతతరం వారికి ఆందోళనకు కారణమవుతోంది. అదేసమయంలో కొందరు మహిళలు పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కూడా పెళ్లి పెటాకులవడానికి ఓ కారణంగా ఉంది.

అయితే శంషాబాద్ కు చెందిన ఓ మహిళ గత రెండు రోజులుగా కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. తమ బంధులు, స్నేహితులను అడిగి చూసినా లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మహిళ భర్తకు ఓ సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే భర్త పరిగిలోని ఓయో హూటల్ కి వెళ్లి చూడగా సదరు మహిళ మరో వ్యక్తితో ఏకాంతంగా కనిపించింది. సడెన్ గా భర్త ఎంట్రీ ఇవ్వడంతో మహిళల కంగారుపడింది.

ఆవేశంతో ఊగిపోయిన భర్త ఆమెతో ఉన్న యువకుడిని బయటకు లాక్కొచ్చి చితకబాదాడు. గొడవ జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సదరు యువకుడిని పోలీస్ స్టషన్ కి తరలించారు. ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో కొన్ని ఓయో రూములను అడ్డగా చేసుకొని పేకాట, మద్యం సేవించడం, వ్యభిచారం లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి.

పోలీసులకు సమాచారం అందడం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి. కొంతమంది ఓయో హూటల్స్ లవర్స్ కి బెస్ట్ స్పాట్ గా మారుతున్నాయని ఫిర్యాదులు సైతం వస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker