News

హైదరాబాద్ లో 76 శాతం మంది ఆ లోపంతో బాధపడుతున్నారు. యువతలో ఎక్కువగా..!

విటమిన్-D లోపం.. శరీర కండరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కండరాల నొప్పి, నీరసం, ఎముక సాంద్రత, పిల్లల్లో రికెట్స్ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించే విటమిన్-D అధిక మొత్తంలో శరీరానికి అందడం చాలా ముఖ్యం. ఎపిడెమియోలాజికల్ అధ్యయనాల్లో విటమిన్-D అధిక స్థాయిలో ఉండే వ్యక్తులు ఎంతో ఆరోగ్యంతో.. చురుగ్గా ఉన్నట్లు తేలింది. అయితే శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ తో పాటు మినరల్స్ , విటమిన్స్ సక్రమంగా అందితేనే ఆరోగ్యంగా ఉంటారు. నగరాల్లో ఏసీ కార్యాలయ ఉద్యోగులు పెరిగిపోవడంతో ప్రజలు డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.

హైదరాబాద్‌లో 76 శాతం, విశాఖపట్నంలో 82 శాతం మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. వైజాగ్‌లో జాతీయ సగటు కంటే డి విటమిన్ లోపం ఎక్కువగా ఉండగా, హైదరాబాద్‌లో 76 శాతంగా ఉంది. ఏడాది పొడవునా సూర్యుడు ప్రకాశించే దేశం మనది. ఇటువంటి ఉష్ణమండల దేశంలో, జనాభాలో నాలుగింట మూడు వంతుల మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారనే విషయం ఆందోళన కలిగిస్తోంది. సూర్యరశ్మి డి విటమిన్ యొక్క అతిపెద్ద ఆధారం. అయితే కొన్ని ఆహార పదార్థాలు కూడా తక్కువ మొత్తంలో విటమిన్ డిని అందిస్తాయి.

డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్, టాటా 1ఎంజి ల్యాబ్స్ దేశంలోని 27 నగరాల్లో 2.2 లక్షల మందిపై సర్వే నిర్వహించాయి. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, జనాభాలో దాదాపు 76 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని తేలింది. మొత్తంగా 79 శాతం మంది పురుషులు వారి శరీరంలో విటమిన్ డి కావాల్సిన స్థాయి కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక స్త్రీలలో ఈ లోపం 75 శాతంగా ఉంది. యువతలో లోపం ఎక్కువగా ఉంది.. జాతీయ సగటుతో పోలిస్తే, ఆసక్తికరంగా, యువకులు విటమిన్ డి లోపంతో ఎక్కువగా ప్రభావితమవుతున్నట్లు తేలింది.

దీని ప్రాబల్యం 25 ఏళ్లలోపు 84 శాతం మంది, 25-40 ఏళ్ల వయసు వారిలో 81 శాతంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం , హైదరాబాద్‌లోనూ వివరాలు సేకరించారు. వైజాగ్‌లో జాతీయ సగటు కంటే డి విటమిన్ లోటు ఎక్కువగా ఉండగా, హైదరాబాద్‌లో 76 శాతం ఉంది. విటమిన్ డి ప్రాముఖ్యత..సూర్యరశ్మి నుంచి డి విటమిన్ లభిస్తుంది. పెరుగుదల, అభివృద్ధి, జీవక్రియ, రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి డి విటమిన్ అవసరం. మంచి ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు, తీసుకునే ఆహారం నుండి శరీరం గ్రహించడంలో డి విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది.

దీని లోపం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, డిప్రెషన్, డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, రికెట్స్ వంటి అనారోగ్యాలు వస్తాయి. డి విటమిన్ లోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువే. విటమిన్ డి లోపానికి కారణాలు..మారుతున్న ఆహారపు అలవాట్లు, సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడం, ఇండోర్ జీవనశైలి కారణంగా విటమిన్ డి లోపాలు పెరిగిపోయాయి. యుక్త వయసు వారిలో చాలా ఎక్కువగా ఉంది. విటమిన్ డి-కలిగిన బలవర్థకమైన తృణధాన్యాలు, చేపలు వినియోగం తక్కువే లోపానికి ప్రధాన కారణం. ముఖ్యంగా శీతాకాలంలో ఆహార లోపం ఉన్న మహిళల్లో డి విటమిన్ లోపాలు పెరిగిపోతున్నాయని గుర్తించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker