23 ఏళ్లకే స్టార్ హోటల్లో పట్టుబడిన హీరోయిన్..! గుట్టుగా పెళ్లి చేస్తే చివరికి ఏమైందో తెలుసా..?
సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. అయితే కొందరి హీరోల కారణంగా హీరోయిన్లు జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు అయితే కాస్టింగ్ కౌచ్ అంటూ హీరోయిన్లు బయటకు వచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు. అయితే ఇక తెలుగులో కొత్త బంగారులోకం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా మారింది.
ఈ ఒక్క సినిమా ఆమె జీవితాన్నే మార్చింది. నిజానికి ఆమెను ఆ సినిమాలో చూసిన తెలుగు ప్రేక్షకులు మరో స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. ఆ సినిమాలో అంత అందంగా ముద్దుగా బొద్దుగా ఉంది ఈ బ్యూటీ.. నటిగానే కాకుండా రచయిత్రిగా, డాక్యుమెంటరీ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా శ్వేత రాణిస్తోంది. జంషెడ్ పూర్ లో 1991 జనవరి 11న జన్మించిన శ్వేతాబసు చిన్నతనంలోనే ముంబైకి వచ్చారు. షారుఖ్ సినిమాలో కూడా నటించిన శ్వేతా బసు 2014లో ఎవరు ఊహించని విధంగా ఓ స్టార్ హోటల్ లో పట్టుబడింది.
దాంతో పోలీసులు ఆమెను వ్యభిచారం ఆరోపణలపై అరెస్టు చెయ్యగా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. శ్వేతా బసును అరెస్ట్ చేసిన సమయంలోనే ఆ రాకెట్ కు సూత్రధారి అయినా అసిస్టెంట్ డైరెక్టర్ ను అరెస్ట్ చేశారు.. ఈ కేసు అప్పట్లో సంచలనంగా నిలిచింది.. అయితే ఆ అరెస్ట్ పై ఆరోపణలను శ్వేతా బసు రెస్క్యూ నుంచి వచ్చాక ఖండించారు. ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్ వెళ్తే అక్కడ ఆమెపై తప్పుడు ఆరోపణలు చేసారంటూ అవేదం వ్యక్తం చేశారు.
ఆతర్వాత కొన్ని నెలలకు ఆమెకు పోలీసులు కూడా క్లిన్ చిట్ ఇచ్చారు.. కానీ ఆమె కెరిర్ పై మాత్రం ఈ ఘటన బాగా ప్రభావం పడింది. ఇక 2018లో ఆమె ప్రేమించి ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకోగా కేవలం 9 నెలల సమయంలోనే ఆమె అతనితో విడాకులు తీసుకుంది.. ఇలా 17 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చి 23 ఏళ్లకే ఇలా కేసులో ఇరుక్కొని విడాకులు తీసుకుంది ఈ కొత్తబంగారు లోకం హీరోయిన్.