Health

ఈ నీళ్ళు తాగితే మలబద్ధకం, చాతీలో మంట వెంటనే తగ్గిపోతాయి.

తేనె, నిమ్మకాయ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రీ రాడికల్స్‌తో పోరాటానికి కావల్సిన శక్తిని శరీరానికి ఇస్తాయి. అందుకే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సలహా ఇస్తుంటారు. ఈ రకమైన పానీయం శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. అయితే మన ఆరోగ్యం కోసం సహజసిద్ధమైన ఆహారాలు తీసుకుంటేనే మంచిది. లేదంటే హెల్త్ దెబ్బతిని రోగాల బారిన పడతాం. ఈ నేపథ్యంలో మన ప్రకృతి మనకు ఎన్నో అందించింది. మనం వాటిని వాడుకోలేకపోతున్నాం. దీంతోనే వ్యాధులతో సతమతమవుతున్నాం.

తేనె ప్రకృతిలో దొరికే ఆహారం. ఇది మనకు ఎంత బలాన్నిస్తుందంటే ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుంది. మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తేనెను ఎప్పుడు కూడా వేడి చేయొద్దు. ఒకవేళ చేస్తే అందులోని ప్రొటీన్లు నశిస్తాయి. దీంతో తేనె మనకు ఉపయోగకరంగా ఉండదు. ఒక టీ స్పూన్ తేనె, స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. పెదవులు సహజ రంగులో మెరవాలంటే స్పూన్ తేనెలో పంచదార కలిపి పెదవులపై మర్ధనా చేస్తే ఫలితం ఉంటుంది.

శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవాలంటే ఒక కప్పు హెర్బల్ టీకి ఒక స్పూన్ తేనె కలిపి తాగితే సరిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారు స్పూన్ తేనెకు అరస్పూన్ దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగడం మంచిది. సైనస్ అదుపులో ఉండాలంటే రెండు స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ కు ఒక స్పూన్ తేనె కలిపి తాగితే సరి. మలబద్ధకం, చాతీలో మంటలు తగ్గడానికి ఒక స్పూన్ తేనె, సగం చెక్క నిమ్మరసం కలిపి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పరగడుపున తాగాలి.

బరువు తగ్గాలనుకునే వారు ఉపవాసం చేసే సమయంలో తేనె, నిమ్మరసం నీళ్లు కలిపి తాగితే ఆకలి వేయదు. మద్యం తాగిన తరువాత తలనొప్పి వస్తే తేనె దాన్ని అదుపులో ఉంచుతుంది. ఇందులోని ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర కాలేయంలోని మద్యాన్ని విడగొట్టి మనకు హాయి కలిగే భావన కలిగిస్తుంది. ఇలా తేనెతో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అల్సర్లు, ఎసిడిటితో బాధపడేవారు ఖాళీ కడుపుతో తేనె, నిమ్మరసం తీసుకుంటే రావొచ్చు.

అందుకే వీరు తేనెకు దూరంగా ఉండటమే మంచిది. మధుమేహులకు కూడా తేనె పడదు. వారు దీనికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. కానీ మిగతా వారు మాత్రం తేనెను రెగ్యులర్ గా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి వారిలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. భవిష్యత్ లో కూడా రోగాలు రాకుండా నియంత్రించడంలో తేనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ విషయం తెలుసుకుని తేనెను వాడుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని గ్రహించుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker