Health

ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే మీ కిడ్నీలు జీవితకాలం ఆరోగ్యంగా ఉంటాయి.

మనిషి శరీరంలో కిడ్నీలు ఎంతో ముఖ్యమైనవి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్ర పిండాలు శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. ఆరోగ్యంగా జీవించాలంటే కిడ్నీలు మెరుగ్గా పనిచేయడం ఎంతో అవసరం. అయితే మన శరీరంలోని మలినాలను మూత్రపిండాలే బయటకు పంపుతాయి. ఇవి దెబ్బతింటే మన శరీరంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోయి ఎన్నో రోగాలు వస్తాయి. అయితే మన మూత్రపిండాలు ఎన్నో కారణాల వల్ల దెబ్బతింటాయి.

అంతేకాదు పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా వాడినా కూడా మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులు కొన్నిసార్లు మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. మూత్రం లేదా మూత్రపిండాలలో రాళ్లు మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. పసుపు.. పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి.

పసుపుకు కర్కుమిన్ అనే రసాయనమే రంగును ఇస్తుంది. ఇది మనం ఎన్నో వ్యాధుల నుంచి బయటపడటానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పసుపును డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యం కూడా బాగుంటుంది. పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అల్లం..అల్లం దగ్గు, జలుబు, వైరల్ జ్వరం నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే అల్లం మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

వెల్లుల్లి.. వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. వెల్లుల్లి అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడంతో పాటుగా వెల్లుల్లి మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉల్లిగడ్డ.. ఉల్లిగడ్డలో ఎన్నో రోగాలను తగ్గించే సామర్థ్యం ఉంటుంది. ఉల్లిపాయ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే ఉల్లిపాయను ప్రతి కూరలో వేసుకుని తినండి. ఉల్లి మీ మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

రెడ్ క్యాప్సికం.. రెడ్ క్యాప్సికమ్ లో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది. రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఆలివ్ ఆయిల్.. మూత్రపిండా వ్యాధితో బాధపడేవారు ఆలివ్ ఆయిల్ ను వాడితే మంచిది. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker