Health

ఈ వంటింటి చిట్కాలతో గ్యాస్ట్రిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం.

పొట్ట ఉబ్బరంగా ఉంటూ తేన్పులు వస్తున్నాయంటే గ్యాస్ట్రిక్ సమస్యగానే చూస్తారు. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారాల వల్ల మనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పొట్టలోపేరుకుపోయిన వ్యర్థాలతో కడుపు ఉబ్బరంగా మారుతుంది. దీంతో మనం తిన్నది కూడా జీర్ణం కాదు. పుల్లటి తేన్పులు వస్తాయి. దీని వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలైతే చాలు.. మరెన్నో సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమస్య కారణంగా ఏదైనా తినాలన్నా భయమే. అలాంటప్పుడు కొన్ని ఇంటిచిట్కాల ద్వారా ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.

గ్యాస్ట్రిక్ సమస్యకు ముఖ్య కారణమేంటంటే… శరీరం ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు ఎక్కువ మోతాదులో విడుదలవుతుంటాయి. ఇవి కడుపులో పేరుకుపోతుంటాయి. ఇవి బయటకు విడుదల కాకపోవడంతో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య రోజువారీ ఆహార పదార్థాల ఎంపికపై ఆధారపడి ఉంటుంది. తాజా అల్లం.. గాస్ట్రిక్ సమస్యకు తగ్గించేందుకు భోజనం అనంతరం ఓ టీస్పూన్ తాజా అల్లం తురుముని ఒక టీస్పూన్ నిమ్మరసంతో తీసుకోవాలి. అల్లం టీ తాగడం కూడా గ్యాస్ ఉపశమనానికి సమర్థవంతమైన ఇంటి నివారణగా చెప్పబడుతుంది. అల్లం సహజమైన కార్మినేటివ్ (అపానవాయువు నుండి ఉపశమనం కలిగించే ఏజెంట్లు) గా పనిచేస్తుంది.

జీరా వాటర్ (జీలకర్ర నీళ్ళు)..జీలకర్ర నీళ్లు గ్యాస్ట్రిక్ సమస్యలకు ఉత్తమ పరిష్కారం.”జీరా( జీలకర్ర)లో కొన్ని ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తాయి, క్రమంగా ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా అదనపు వాయువు ఏర్పడకుండా చేస్తాయి” అని డాక్టర్ సూద్ వివరించారు. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని రెండు కప్పుల నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉడకబెట్టండి. మీ భోజనం పూర్తి చేసిన తర్వాత దానిని చల్లబరచండి, ఆపై వడకట్టి, నీటిని సేవించండి. ఇంగువ (అసఫోటిడా)..అర టీస్పూన్ ఇంగువను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం ద్వారా, గ్యాస్ సమస్యను అరికట్టవచ్చని తెలుస్తుంది. మీ కడుపులో అధిక వాయువును ఉత్పత్తి చేసే గట్ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే “యాంటీ ఫ్లాటులెంట్” వలె ఇంగువ పనిచేస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం, ఇంగువ శరీరం యొక్క వాత దోషాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ‘ఆయుర్వేద గృహ చిట్కాలు’ అనే పుస్తకంలో డాక్టర్ వసంత లాడ్ వాత దోషంలో పెద్దప్రేగు ప్రధాన భూమికను పోషిస్తుందని, మరియు ఇది వాయువుకి సంబంధించిన దోషమని వివరించారు. పెద్దప్రేగులో వాత దోషం పెరిగినప్పుడు, వాయువులు అధికమవుతాయి. వాము (అజ్వైన్)..“వాము లేదా అజ్వైన్ విత్తనాలలో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్ట్రిక్ రసాలను విడుదల చేస్తుంది” అని బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అంజు సూద్ వివరించారు. మంచి ఫలితాలను పొందడానికి రోజులో ఒకసారి అర టీస్పూన్ వామును నీటితో కలిపి వేడి చేసి తాగొచ్చు.. బేకింగ్ పౌడర్ నిమ్మరసం మిశ్రమం..

టీస్పూన్ నిమ్మరసం, సగం టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు నీటితో కలిపి సేవించడం. ఇది జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేసే కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. కాబట్టి మీ భోజనం తర్వాత దీనిని తీసుకోవచ్చు. త్రిఫల..మూలికా పొడి అయిన త్రిఫల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించేందుకు అద్భుతంగా సహాయపడుతుంది. సగం టీస్పూన్ త్రిఫల పొడిని వేడి నీటిలో 5 నుండి 10 నిమిషాలు ఉంచి, పడుకునే ముందుగా ఈ ద్రావణాన్ని సేవించాలి. ఈ మిశ్రమంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి.. తగిన మోతాదులో తీసుకోవాలని గుర్తుంచుకోండి. అధికంగా తీసుకున్న పక్షంలో ఉబ్బరానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి.

వాస్తవానికి, అపానవాయువు అనేది ఒక సాధారణమైన పరిస్థితి మరియు ఈ సమస్యను ఎదుర్కోని వారు ఉండరు. కానీ సమస్య తగ్గకుండా ఎక్కువవుతుంటే, ఇది లాక్టోస్ టోలరెన్స్, హార్మోన్ల అసమతుల్యత లేదా ఒక రకమైన ప్రేగు సంబంధిత తీవ్రమైన సమస్యలకు సంకేతంగా మారుతుంది. తరచుగా మాత్రల మీద ఆధారపడడం కన్నా, వీలైనంతవరకు సహజసిద్దమైన పరిష్కార మార్గాలను ఆశ్రయించడం ఎప్పుడూ కూడా మంచిదే. ఇవన్నీ చేసినతర్వాత కూడా సమస్య అదుపులోకి రాని పక్షంలో ఖచ్చితంగా వైద్యుడ్ని సంప్రదించాల్సిందే.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker