Health

ఇంట్లో తులసి మొక్క పెంచుకుంటే ఎన్ని రోగాలు రాకుండా కాపాడుతుందో తెలుసుకోండి.

భారతదేశంలో హిందువులందరూ కూడా తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ మొక్కలో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయని విషయం మనకు తెలిసిందే. వీటితో పాటు దైవత్వానికి ప్రతీకగా కూడా ఈ మొక్కను పూజిస్తాము. తులసి వ‌ల్ల ప‌లు రోగాలను న‌యం చేయ‌వ‌చ్చు. ఈ చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిద‌ని దాని వల్ల అన్ని శుభాలే జరుగుతాయని నమ్ముతారు. అయితే తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తు పరంగా, శాస్త్రీయంగా ఈ మొక్కతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. హిందువులు తులసి చెట్టును పవిత్రంగా భావించి పూజలు చేస్తుంటారు.

ఈ సంప్రదాయం పూర్వ కాలం నుంచే అలవడుతూ వస్తోంది. ఆ నాటి నుంచే ఈ మొక్కను ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పెంచుతూ వస్తున్నారు. దివ్య ఔషధంగానూ తులసి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీనితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదం.. తులసిని ఆయుర్వేదంలో వాడతారు. తులసి ఆకులు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి. వీటికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ల నుంచి పోరాడటానికి సహకరిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి తులసి ఆకుల సద్గుణాలు తోడ్పడతాయి.

అలాగే కొన్ని రకాల రోగాలకు చికిత్స చేసేందుకు తులసిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదం.. తులసిని ఆయుర్వేదంలో వాడతారు. తులసి ఆకులు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి. వీటికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ల నుంచి పోరాడటానికి సహకరిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి తులసి ఆకుల సద్గుణాలు తోడ్పడతాయి. అలాగే కొన్ని రకాల రోగాలకు చికిత్స చేసేందుకు తులసిని ఉపయోగిస్తారు. దీంతో పాటు తలనొప్పి, వాపు, గుండె జబ్బులు, మలేరియా వంటిని నయం చేయడానికి తులసి ఉపయోగపడుతుంది.

శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకు పోకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచడానికి సహకరిస్తుంది. అందుకే, చిన్న పిల్లలకు తులసి రసాన్ని తాగిస్తే చాలా మంచిది. సౌభాగ్యం : వాస్తు పరంగానూ తులసి మొక్కతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి ఒక లక్కీ ప్లాంట్‌. దీన్ని ఇంట్లో పెంచుకుంటే పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. దీంతో పాటు ఈ మొక్కను చూసినప్పుడు, వాసన పీల్చినప్పుడు ఒత్తిడి దూరం అవుతుంది.

తులసి మొక్కకు పూజ చేస్తే శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. పెళ్లి కాని ఆడపడుచులు ఈ మొక్కకు పూజ చేస్తే కళ్యాణ భాగ్యం ప్రాప్తిస్తుందని సూచిస్తోంది. ఇతర గుణాలు.. తులసి మొక్కకు చెడు వాయువులను పీల్చే గుణం ఉంటుంది. హానికర వాయువులను పీల్చుకుని తులసి ఆకులు స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తాయి. మలినాలను తొలగించుకుని తనని తాను శుభ్రం చేసుకునే గుణం తులసికి ఉంటుంది. తులసి చెట్టు రోజంతా కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకొని, ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఈ లక్షణాలు ఉన్న అతి కొద్ది మొక్కల్లో తులసి ఒకటి కావడం విశేషం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker