News

వినాయకచవితికి ఇంట్లో గణేషుడిని పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు.

మొదట మనం ఏ దేవుడిని పూజించాలన్నా కూడా వినాయకుడిని పూజించాలి వినాయకుడిని పూజిస్తే ఆటంకాలే కూడా లేకుండా మన పనులు పూర్తయిపోతాయి. అయితే గణపతి పూజ కోసం ఆయన విగ్రహాన్ని కొన్నప్పుడు విగ్రహం ఎంత బాగుంది అనే చూస్తారు కానీ.. చాలా మంది తొండం గురించి పెద్దగా పట్టించుకోరు. వాస్తు ప్రకారం, గణపతి ఎడమ వైపు తొండం ఎక్కువ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్యాన్ని విశ్వసిస్తే గణేశుడి వివిధ భాగాలు జీవితంలోని విభిన్న విషయాలను సూచిస్తాయి. ఉదాహరణకు పెద్ద ఏనుగు తల తెలివితేటలు, జ్ఞానం, జీవితంలోని సమస్యలను ఎదుర్కునే శక్తిని సూచిస్తుంది.

అదేవిధంగా గణపతి తొండం అన్ని ప్రాపంచిక సమస్యలను నిర్వహించడానికి అనుకూలత , సామర్థ్యాన్ని సూచిస్తుంది. గణపతి తొండానికి సంబంధించిన నమ్మకాలు.. అందరూ చెప్పేది ఒకటే – కుడి తొండం ఉన్న గణేశ విగ్రహం బలమైనది, శక్తివంతమైనది, పూజకు పనికిరాదు. గణేశుడి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీ దేవి వైపు అంటే ఎడమ వైపుకి ఉండాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఇళ్లలో ఇలాంటి గణపతినే పెట్టుకోవాలి.

తొండం దిశకు సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి . అందరూ చెప్పేది ఒకటే – కుడి తొండం ఉన్న గణేశ విగ్రహం బలమైనది, శక్తివంతమైనది మరియు పూజకు పనికిరాదు. గణేశుడి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీ దేవి వైపు అంటే.. ఎడమ వైపుకి ఉండాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఇళ్లలో ఇలాంటి గణపతినే పెట్టుకోవాలి. గణేశుడి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీ దేవి వైపు అంటే ఎడమకు తిరిగి ఉండాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఇళ్లలో ఇలాంటి గణపతినే పెట్టుకోవాలి.

చంద్రుని దిశలో ఉన్నందున తొండం ఎడమవైపునకు తిరిగిన వినాయకుడి విగ్రహాలు సాధారణంగా ప్రశాంతంగా ఉంటాయని నమ్ముతారు. ఈ విగ్రహం ఓదార్పు శక్తి ప్రవాహానికి ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగా, గణపతి విగ్రహం ఎడమ వైపునకు ఉండటం వల్ల పూజకు శుభప్రదంగా భావిస్తారు, ఇది ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది. తొండం కుడివైపుకు తిరిగిన గణేశ విగ్రహాలు మరింత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి, ఇవి శక్తి ప్రవాహానికి అనుగుణంగా ఉండే సూర్య వాహినిని సూచిస్తుంది.

అందువల్ల తొండం కుడివైపునకు తిరిగి ఉన్న విగ్రహాల ఇంట్లో పెట్టుకోవద్దని నిపుణుల సలహా. తొండం కుడివైపుకు తిరిగిన గణపతి చాలా మొండిగా ఉంటాడట. అతని పూజలో చిన్న దోషాన్ని కూడా అంగీకరించడు. అలాంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు. మీరు వాస్తును విశ్వసిస్తే, మీరు ఇంటిలో తొండం ఎడమ వైపున ఉన్న గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker