ఇంట్లో చీమలు ఎక్కువగా తిరుగుతున్నాయా..? అది దేనికీ సంకేతమో తెలుసా..?
చాలా మంది ఇంట్లో చీమలు బెడద ఉంటుంది. ముఖ్యంగా ఎర్ర చీమలు ఎక్కువగా చికాకు పెడుతుంటాయి. ఇంటి గోడల మూలల్లో, వంటిట్లో ఉండే పంచదారలో లేదా వండిన ఇతర ఆహార పదార్థాలలో టక్కున దూరిపోతాయి. అప్పుడప్పుడు బట్టలపై చేరి కుడుతూ తీవ్రమైన ఇబ్బంది పెడుతాయి. ఇంతటి ఇబ్బంది కలిగించే ఈ డెవిల్ చీమలను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని అందరూ ఆలోచిప్తారు.
అయితే సాధారణంగా అందరి ఇళ్లలో చీమల సమస్య వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా వంట గదిలో అయితే ఎటు చూసినా ఉంటాయి. పంచదార డబ్బా మూత తీస్తే అవే కనిపిస్తాయి. చీమలు కనిపిస్తే ఏదో మందు వేసి చంపేస్తాం. కానీ చీమలు అదృష్టానికి ప్రతీకమని మీకు తెలుసా? సాధారణంగా చీమల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర చీమలు, మరొకటి నల్ల చీమలు.
ఇలా చీమలను బట్టి మనకు మంచి జరుగుతుందో లేక కష్టాలు ఎదురవుతాయో.. వాస్తు శాస్త్రం ప్రకారం తెలుసుకోవచ్చు. నల్ల చీమలు మీ ఇంట్లోకి లైన్ కట్టి వస్తే ఆనంద పడండి. ఎందుకంటే ఇవి అదృష్టాన్ని తెచ్చి పెడతాయి కాబ్టట్టి. నల్ల చీమలు ఇంట్లో ఉంటే ధన లాభం కలుగుతుందని చెబుతారు వాస్తు నిపుణులు. అలాగే అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయని, కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారని, ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.
అయితే మరీ గుట్టలు గుట్టలుగా నల్ల చీమలు ఉంటే మాత్రం మంచిది కాదు. బెడ్ రూమ్ లో నల్ల చీమలు కనిపిస్తే కొత్త బంగారు వస్తువలు కొనుగోలు చేస్తారని, ఇంటి టెర్రస్ పైన ఉంటే మరో స్థలం లేదా ఇల్లు కొనుక్కునే అదృష్టం కలుగుతుందట. అలాగే నల్ల చీమలు ఉత్తరం వైపు నుండి బయటకు వస్తే జీవితాల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, దక్షిణ దిశ నుండి చీమలు బయటకు వస్తే ధన లాభం జరుగుతుందట.
అలాగే తూర్పు దిశ నుండి చీమలు బయటకు వస్తే అదృష్టాన్ని సూచిస్తుందని చెబుతూంటారు. ఇలా నల్ల చీమలు ఇంట్లో ఉంటే అదృష్టం ఏ రూపంలో అయినా కలగవచ్చు. అదే ఎర్ర చీమలు ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు మంచిది కాదట. ఎర్ర చీమలు ఇంట్లో ఉంటే ధన నష్టం, కష్టాలు, ప్రతికూల పరిస్థితులు, నెగిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తాయట. కాబట్టి ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం మందు వేసి వెంటనే చంపేయండి.