HIV రోగులకు అద్దిరేపోయే గుడ్ న్యూస్, త్వరలోనే హెచ్ఐవీ కి వ్యాక్సిన్ రాబోతుంది.
హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ కి ఇప్పటికీ దీనికి కచ్చితమైన చికిత్సలు అందుబాటులోకి రాలేదు. కొన్ని విధానాల ద్వారా ఇన్ఫెక్షన్ను నిరోధిస్తూ, దీని ప్రభావాన్ని తగ్గించగలిగినప్పటికీ.. వ్యాధిని నయం చేయడానికి ఎటువంటి నిర్దిష్ట చికిత్స లేదా టీకాలు మాత్రం రాలేదు. అయితే HIVకి చికిత్స లేదా వ్యాక్సిన్‌ను కనుగొనడంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే హెచ్ఐవీ.. ఇదొక భూతం లాంటిది. ఈ వ్యాధిని నివారించేందుకు ఎటువంటి మందులు, టీకా లేవు.
ఇది వస్తే రోగి జీవితం నాశనం అయినట్టే. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించి మరణించడమే. కానీ ఇక మీదట హెచ్ఐవీ వల్ల ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదని పరిశోధకులు కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నారు. హెచ్ఐవీ వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి అమెరికా, సౌత్ ఆఫ్రికాలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. మొదటి దశలో వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి ప్రతిస్పందనని ప్రేరేపించే విధమైన నోవల్ వ్యాక్సిన్ ని అందించనున్నారు.
దీని పేరు VIR-1388. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో భాగమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డీసీజెస్(NIAID) ఈ వ్యాక్సిన్ కి అయ్యే ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. హెచ్ఐవీకి సంబంధించి అధ్యయనాలు చేసేందుకు నిధులను అందిస్తోంది. VIR-1388 అనేది హెచ్ఐవీని గుర్తించి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ ని నిరోధించి రోగనిరోధక శక్తిని సూచించే T కణాలను ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తుంది. VIR-1388 సైటోమెగలోవైరస్(CMV) వెక్టర్ ని ఉపయోగిస్తుంది. CMV శతాబ్దాలుగా ప్రపంచ జనాభాలో చాలా వరకు ఉంది.
CMVతో జీవిస్తున్న చాలా మంది వ్యక్తులు ఎటువంటి లక్షణాలను అనుభవించరు, కానీ వాళ్ళు వైరస్‌తో జీవిస్తున్నారని తెలియదు. NIAID 2004 నుంచి ఈ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం నిధులు సమకూరుస్తూ వస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కో లోని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, బయోటెక్నాలజీతో ఈ ట్రయల్‌కు నిధులు సమకూరుస్తోంది. ఈ ట్రయల్‌ని Vir స్పాన్సర్ చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్ యునైటెడ్ స్టేట్స్ లోని ఆరు సైట్స్ లో, సౌత్ ఆఫ్రికాలోని నాలుగు ప్రదేశాలలో జరుగుతోంది. ఈ అధ్యయనంలో 95 మంది హెచ్ఐవీ నెగటివ్ పార్టిసిపెంట్లు నమోదు చేసుకున్నారు.
ట్రయల్స్ ఫలితాలు 2024 చివర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదటి టీకా ఇచ్చిన తర్వాత మూడు సంవత్సరాల వరకు అధ్యయనం కొనసాగుతోంది. ఇదే జరిగితే ఎయిడ్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ఎంతోమందిని రక్షించుకోవచ్చు. గతంలో కూడ హెచ్ఐవీ నిర్మూలన కోసం కృషి చేస్తున్న ఒక ప్రొఫెసర్ త్వరలోనే ఎయిడ్స్ కి అంతం రాబోతుందని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఎయిడ్స్ రోగులు కోలుకున్నట్టు నివేదికలు వస్తూనే ఉన్నాయి. ఐదుగురు హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించారు.