News

హీరోయిన్‌ ప్రేమతో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..? ఆ రూమర్స్‌ రావడంతో..!

అప్పట్లో గ్లామర్ పాత్రలను కూడా చేస్తూ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది ప్రేమ.కాగా మొదట ప్రేమ విక్టరీ వెంకటేష్ నటించిన ధర్మచక్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే భారీగా క్రేజ్ ను ఏర్పరచుకున్న ప్రేమ ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. తాజాగా ప్రేమతో పాటు తరుచూ ఒక వ్యక్తి కనిపిస్తున్నారని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కన్నడలో సినీబజ్ వెబ్‌సైట్ ప్రేమ గురించి ఒక వార్తను ఫోటోతో పాటు ప్రచురించింది.

ఈ ప్రచురించిన నివేదిక ప్రకారం, ప్రేమతో పాటు కన్నడ టెలివిజన్ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్‌గా పేరుగాంచిన అరవింద్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి కారణాలు ఏంటో అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ అరవింద్ కూడా ఉంటున్నారని తెలిపింది. రీసెంట్‌గా ప్రేమ కర్ణాటకలోని కొరగజ్ఞ సన్నిధికి వెళ్లినప్పుడు అరవింద్‌తో ప్రేమ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందా అని టాక్ కూడా వినిపించింది.

తల్లిదండ్రులతో ప్రేమ అయితే ఇప్పుడు ఆ టాక్‌.. టాక్‌గానే మిగిలిపోయిందని, వారిద్దరి మధ్య అలాంటి సంబంధం లేదని, వారు మంచి స్నేహితులు మాత్రమేనని కొన్ని కన్నడ వెబ్‌సైట్స్‌ చెబుతున్న మాట. వాస్తవానికి ప్రేమ రెండో పెళ్లి గురించి పలుమార్లు రూమర్స్‌ వచ్చాయి. వాటిని ఆమె తిప్పి కొట్టింది కూడా.. ఇప్పుడు కూడా ఫోటో అయితే వైరల్‌ అవుతుంది కానీ అది ఎప్పటిది..? వారిద్దరి మంధ్య ఉన్న రిలేషన్‌ ఏంటి అనేది పూర్తి వివరాలు లేవు.

నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వార్తలపై ప్రేమ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి. పెళ్లి గురించి ప్రేమ గతంలో చెప్పిన మాట..రెండో పెళ్లి అంటూ రూమర్స్‌ వచ్చాయి. జీవితంలో పెళ్లి ఉండాలి. నాకు తగిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఎలా ఉండాలనేది నాకు తెలుసు. నా మీద ఇంకో రూమర్‌ కూడా సృష్టించారు. నాకు క్యాన్సర్‌ వచ్చిందని ప్రచారం చేశారు. అలాంటిదేమీ లేదు. డిప్రెషన్‌ వల్ల కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉన్నాను.

ఆ సమయంలో నాకు క్యాన్సర్‌ ఉందని పుకార్లు వ్యాప్తి చేశారు’ అని చెప్పుకొచ్చింది ప్రేమ. ఇక తనకు 70 ఏళ్లు వచ్చాక కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అప్పుడు చేసుకుంటే తప్పు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. మనకు దొరికేది ఒకటే జీవితం అని ఆ జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆమె పేర్కొన్నారు. జీవితంలో తనకు నచ్చినట్లే ఉండమని తన అమ్మగారు కూడా చెప్పారని ఆమె తెలిపింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker