హీరో అర్జున్ రెండో కూతుర్ని చూశారా..! హీరోయిన్స్ తో పోలిస్తే..?
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో జెంటిల్ మెన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అంతకు ముందు తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. ఇప్పటికీ ఆయన నటించిన ఒకే ఒక్కడు సినిమాకు బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అర్జున్.. సహాయ నటుడిగా, విలన్ పాత్రలు ఫోషిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా నటులే కాదు, వారి వారసులు కూడా ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ అవుతున్నారు అవుతున్నారు. అయితే వారు సినిమాల్లోకి రావడమే ఇందుకు కారణమని అంటున్నారు.
కానీ, కొంతమంది నటీనటుల వారసులు సినిమాల్లోకి రాకపోయినప్పటికీ, నెటిజన్లు ఎలాగోలా వారిని కనిపెట్టి వైరల్ చేస్తున్నారు. అలా నటుడు అర్జున్ రెండో కూతురు ఈ మధ్య ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆమె పేరు అంజన. ఒకప్పుడు అగ్ర కథానాయకుడుగా అర్జున్ సర్జా అందరికీ తెలుసు. ప్రస్తుతం పలు ప్రముఖ హీరోల చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒకరు ఐశ్వర్య మరొకరు అంజన. అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ తమిళంలో పట్టతు యాని, కన్నడలో ప్రేమ పరాహా సినిమాల్లో నటించింది.
తెలుగులో కూడా విశ్వక్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ ఇగో ప్రాబ్లమ్స్ వలన ఆ సినిమా ఆగింది. ఇక ఇప్పుడు నటుడు రామయ్య కుమారుడితో పెళ్ళికి సిద్ధం అయింది. అయితే అక్క నాన్న బాటలోనే నటిగా మారితే చెల్లెలు అంజన అలా కాదు. నటీనటుల సంతానంలో కొందరు తమ తల్లిదండ్రుల మాదిరిగానే సినిమాల్లోకి ప్రవేశిస్తే, మరికొందరు తమకు సంబంధం లేని రంగంలోకి దిగుతున్నారు. అలాంటి వారిలో అంజనా ఒకరు. అంజనా స్వయం ఉపాధితో ఎదగాలని అనుకుంటోంది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మోడల్‌గా మారి పోజులిచ్చి మరీ ఫోటోషూట్‌లు చేసింది.
అంజనకు ఇప్పుడు 28 ఏళ్లు. కొన్నాళ్ల క్రితమే ఆమె ‘సర్జా వరల్డ్’ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ ‘సర్జా వరల్డ్’ అనేది హ్యాండ్ బ్యాగ్ బ్రాండ్, ఏడాదిన్నర క్రితం ఆమె ఈ కంపెనీని ప్రారంభించింది. ఇక తాజాగా అంజనా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఇవి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అవి చూసి ఆమె కూడా హీరోయిన్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. చూడాలి అందులో నిజం ఎంత ఉంది అనేది.