Health

ఈ లోపం వల్లనే జుట్టు విపరీతంగా రాలిపోతుంది, దానికి పరిష్కారం ఏంటంటే..?

అందమైన జుట్టు కోసం చాలా మంది రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. మారిపోయిన జీవనశైలి, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో జుట్టు రాలిపోతోంది. మార్కెట్లో దొరుకుతున్న రకరకాల షాంపూలు, నూనెలు, క్రీములు వాడుతూ సమస్యను మరింత జటిలం చేసుకుంటున్నారు. రసాయనాల జోలికి వెళ్లకుండా ఇంట్లోని పదార్థాలతోనే కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌, ఒత్తిడి, కెమికల్స్ ఉండే హెయిర్‌ ఉత్పత్తులు వాడటం వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు కొన్ని పోషకాలు ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా విత్తనాలు జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.

ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మెంతులు గింజలు..హెయిర్ ఫాల్ ను తగ్గించడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు మెంతులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మెంతులను తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. మెంతులు మీ నెత్తి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. మెంతులు చుండ్రును తగ్గిస్తాయి. పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. మెంతులలో ప్రోటీన్, నియాసిన్, అమైనో ఆమ్లాలు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. ఇందుకోసం మీరు వీటిని పచ్చిగా లేదా నానబెట్టి లేదా మొలకెత్తిన తర్వాత తినొచ్చు. దీనితో పాటు మెంతులతో చేసిన హెయిర్ మాస్క్ ను ఉపయోగించినా మంచిది. గుమ్మడికాయ గింజలు.. పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. గుమ్మడికాయ విత్తనాలలో జింక్, సెలీనియం, రాగి, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి.

ఈ పోషకాలన్నీ జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి. జుట్టును పల్చ బడనీయవు. ఈ గింజలు మీ జుట్టును అందంగా మెరిసేలా చేస్తుంది. వీటిని స్మూతీలు, ఓట్ మీల్, గ్రానోలా బార్లు, పాన్ కేక్ లో వేసుకోవచ్చు. గుమ్మడికాయ విత్తన వెన్నను కూడా తయారు చేస్తారు. దీన్ని మీ టోస్ట్ మీద అప్లై చేసి తినొచ్చు. రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ గుమ్మడికాయ గింజలను తినకూడదు. నువ్వులు.. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సరైన పోషణ అవసరం. నువ్వుల్లో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడే ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. నలుపు, తెలుపు నువ్వులు ఎన్నో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం.

ఇది జుట్టును స్ట్రాంగ్ గా మార్చి షైనింగ్ ఇస్తుంది. బీన్స్, ఫ్రైస్, సలాడ్స్ మొదలైన ఆహారాల్లో వీటిని ఉపయోగించొచ్చు. అలాగే నువ్వుల లడ్డూలను కూడా తీసుకోవచ్చు. లేదా రోజుకు ఒక టీస్పూన్ కాల్చిన నువ్వులను తీసుకున్నా దీని నుంచి మంచి పోషకాలు అందుతాయి. పొద్దు తిరుగుడు.. పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఉండే పోషకాలు పర్యావరణ కాలుష్యం వల్ల జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీనిలో జింక్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. ఇందుకోసం మీరు వీటిని బాదం, వాల్ నట్స్ వంటి గింజలతో కలిపి తినొచ్చు. వాటిని వేయించి స్నాక్స్ గా కూడా తినొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ పొద్దుతిరుగుడు విత్తనాలను తినకూడదు. కలోంజి విత్తనాలు.. జర్నల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. కలోంజి విత్తనాలు మీ ఫోలికల్స్ కు తగినంత పోషణను అందిస్తాయి. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా ఆగుతుంది. కలోంజిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టు సమస్యలను పోగొడుతాయి. కలోంజి నెత్తిమీద ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. అవసరమైన పోషక పోషణను అందిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker