హిజ్రాలు ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలుసా..? ఎవ్వరికి తెలియని రహస్యాలు.
ప్రతి రోజూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే హిజ్రాలు సంవత్సరంలో ఆ మూడు రోజులు మాత్రం చాలా ఆనందంగా గడుపుతారు.. అదే హిజ్రాల పండగ. ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. కానీ హిజ్రాలకు అది తీరని కోరికగా మిగిలిపోతుందనీ అనుకోవడం మన పొరపాటే. హిజ్రాలు కూడా పెళ్లి చేసుకుంటారు. వీరి పెళ్లి కోసం పెద్ద ఉత్సవం జరుగుతుంది. అయితే హిజ్రాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మనం నిత్యం ఎక్కడో చోట మనం వీరిని చూస్తూనే ఉంటాం.
అయితే వీరి పుట్టుక గురించే, వీరి ఆచారాల గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం వారి గురించి కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. బయట డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటారు.. కోరిన మొత్తం ఇవ్వకుంటే మగవారిని బావా అంటూ ఆడవారిని అక్కా అంటూ విసిగిస్తూ ఉంటారు. అంతేకాదు ఒక్కోసారి హిజ్రాలు దౌర్జన్యానికి దిగుతుంటారు. దాడులు చేసే వారిలో 10 శాతం మాత్రం హిజ్రాలు మాత్రమే ఉంటారు.
హిజ్రాలు మానవత్వం, ఆత్మాభిమానం కలిగి ఉంటారు. హిజ్రాలు ఇప్పటివారు కాదు. మహాభారతం, రామాయణ కాలంలో కూడా వీరున్నారు. హిందువుల్లో మాత్రమే హిజ్రాలు ఉన్నారని చాలామంది చెబుతుంటారు. కానీ ఇతర మతాల్లో కూడా హిజ్రాలు ఉన్నారని వారివారి మత గ్రంథాలు చెపుతున్నాయి.
అయితే హిందూ మతంలో, అది కూడా మన దేశంలో మాత్రమే వీరిని చులకన చూస్తారు.. ఇకపోతే అతీంద్రీయ శక్తులు ఉంటాయనే విశ్వాసం కూడా వుంది. ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగితే హిజ్రాలను పెద్దలు పిలుస్తుంటారు. వారు ఆశీర్వదిస్తే మంచిదట. అలాగే ఏ పని మొదలుపెట్టినా హిజ్రా ఆశీర్వదిస్తే మంచిది. ఎవరు ఎప్పుడు మరణిస్తారు అనేది హిజ్రాకు తెలుస్తుందట.
కష్టపడి వ్యాపారాలు చేసే వారిలో హిజ్రాలు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హిజ్రాలకు రిజర్వేషన్లు వస్తున్నాయి… వారు చనిపోతే రాత్రి మాత్రం దహనం చేస్తారు.. అందుకు బలమైన కారణాలు చాలానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. వీరిలో కూడా కొందరు ఉత్తమ చదువులు చదివిన వాళ్లు ఉన్నారు…