హై హీల్స్ వాడుతున్నారా..? ఈ ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్టే..?
కాలికి వేసుకునే చెప్పుల దగ్గరి నుంచి హెయిర్ క్లిప్ వరకు ట్రెండీగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు…ఇక ఎత్తు చెప్పుల విషయానికి వస్తే….అదేనండి హైహీల్స్..అమ్మాయిలు షార్టైనా , హైట్‌గా ఉన్నా వీటిని వేసుకునేందుకు ముందుంటున్నారు. అయితే హై హీల్స్ వేసుకోవడం వల్ల అలైన్మెంట్ దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలోని కండరాలు, కీళ్లు శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
దీర్ఘకాలం హై హీల్స్ వాడటం వలన పాదం వెనుక భాగంలో లోపం ఏర్పడుతుంది. బొటనవేళ్లలో కూడా లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. హై హీల్స్ ధరించినప్పుడు మెదడుకు వెళ్లే నరాలు ఒత్తిడికి గురై మెదడు కార్యక్రమాలు సరిగ్గా జరగవు. హై హీల్స్ చెప్పులతో బ్యాక్ పెయిన్ వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.
ఈ చెప్పులు శరీర గురుత్వ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి మారుస్తాయి. దీంతో బ్యాక్ పెయిన్ మొదలవుతుంది. హైహిల్స్ షేప్ కారణంగా పాదాల మీద అధిక భారం పడుతుంది. వెన్నుముక, మెడ వీటి పైన కూడా అధిక భారం పడి ఆ భాగాలు నొప్పికి గురవుతాయి. హైహిల్స్ ధరించడం వలన ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.
కాళ్లు, నడుము, తుంటి ఎముకలు విరిగిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎముకలు బలహీనంగా ఉంటే హై హీల్స్ ధరించడాన్ని అవాయిడ్ చేయటం మంచిది. అలాగే హై హీల్స్ వేసుకుని గంటల తరబడి నిలబడటం వల్ల మోకాలు నొప్పి సమస్య వస్తుంది. కాబట్టి హై హీల్స్ చెప్పులు వేసుకోవడం వలన కలిగే నష్టాలని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఈ చెప్పులు వేసుకోండి.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఇలాంటి చెప్పులు వేసుకోవాల్సి వస్తే తగిన ప్రికాషన్స్ తీసుకోండి. లేదంటే మీరు ఎదుర్కోబోయే ప్రమాదాలు చాలా దీర్ఘకాలికంగా ఉంటాయి.