అధిక రక్తపోటు సమస్యాని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో చుడండి.
రక్తపు పోటు ఎక్కువగా ఉన్న వారికి బయటకి ఏమీ లక్షణాలు కనబడవు. చాప కింద నీరులా ఇది శరీరానికి కొంత హాని చేసిన తరువాత మరో సందర్భంలో ఎప్పుడో జరిగిన హాని ప్రస్పుటమవుతుంది. ఇలా ముదిరిన తరువాత మందులు వాడినా జరిగిపోయిన హానిని తిరగబెట్టలేము. అందుకని తరచు రక్తపు పోటు ఎంత ఉందో, అవకాశం దొరికినప్పుడల్లా – కొలుచుకుని చూసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో వైద్యుణ్ణి చూడ్డానికి ఏ పని మీద వెళ్ళినా రివాజుగా నర్సులు రక్తపు పోటుని కొలిచి నమోదు చేస్తారు. అలా నమోదు చేసినప్పుడు రోగి ఆ కొలతలని అడిగి తెలుసుకుని గుర్తు పెట్టుకోవటం మంచిది.
అయితే జీవనశైలి లో మార్పులు వివిధ రకాల ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, విపరీతమైన పని ఒత్తిడి, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇలా వివిధ కారణాలతో చాలా మందిలో అధిక రక్తపోటు సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక రక్తపోటు అన్నది సైలెంట్ కిల్లర్. ఇది ఎప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఎవరికి అంతుచిక్కదు. అధిక బరువు ఉన్న వారిలో ఈ సమస్య వస్తుంది. మద్యం అనేది బ్లడ్ ప్రెషర్ పెంచేందుకు కారణమౌతుంది. అధిక రక్తపోటు అన్నది మోతాదుకు మించి ఉప్పు తీసుకోవటం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రానెస్ ఫుడ్, పీజ్జాలు, బర్గర్‌లు, రెడీమేడ్ మాంసం, కూల్‌డ్రింక్‌లు, ప్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో అధిక రక్తపోటు ముప్పు పొంచి ఉంటుంది. రక్తపోటు అధికంగా ఉంటే ఏదో ఒక సమయంలో సడన్ గా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదము ఉంటుంది. బిపి అతి తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి.
గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోయి మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వస్తుంది. కళ్లు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు తలెత్తవచ్చు. అధిక రక్తపోటు సమస్యను గుర్తించిన వెంటనే చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే, అది రక్తనాళాలను దెబ్బతీస్తుంది. మెదడు, గుండె, కళ్ళు, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వైద్యుడిని సందర్శించి రక్తపోటును చెక్ చేసుకోవాలి.
వైద్యులు సూచించిన విధంగా చికిత్సను తీసుకోవాలి. పాటించాల్సిన జాగ్రత్తలు.. బరువు పెరగకుండా చూనుకోవాలి. నిత్యం వ్యాయామం, యోగా చేయాలి. మాంసం, మీగడ, వెన్న, నూనే వంటి వాటికీ దూరంగా ఉండాలి. ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జూగ్రత్త వహించాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30నుంచి 45 నిమిషాలు నడవాలి. చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌కు గురికాకూడదు. తరుచు వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి.