కేవలం ఈ లోపం వలనే హైబీపీ వస్తోంది, హైబీపీ వచ్చిన వెంటనే ఏం చెయ్యాలో తెలుసుకోండి.
మారుతోన్న జీవనశైలి, ఆరోగ్య అలవాట్ల కారణంగా రక్తపోటుతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒక్కసారి హైబీపీ అటాక్ అయ్యిందా ఇక జీవితాంతం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్బాల్లో ఇది హృదయ సంబంధిత రోగాలకు సైతం దారి తీస్తుంది. అయితే చాలామంది బీపీతో బాధపడుతూ ఉంటారు. బీపీ వలన ఆరోగ్యం పాడవుతుంది ఏదేమైనాప్పటికీ బీపీ వంటి సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే బీపీ ఈ పోషకాహార లోపం వలన కూడా వస్తుంది మరి ఇక వాటి గురించి తెలుసుకుందాం…
విటమిన్ డి తక్కువగా ఉండటం వలన హైపర్ టెన్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంది. విటమిన్ డి బ్లడ్ వెసెల్స్ పనితీరు పైన ప్రభావం చూపుతుంది. విటమిన్ డి లోపం ఉంటే బీపీ పెరుగుతుంది సూర్యకిరణాల ద్వారా మనకి విటమిన్ డి అందుతుంది. డైరీ ప్రొడక్ట్స్ గుడ్లు వంటి వాటిలో కూడా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి12 లోపం వలన కూడా బీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది విటమిన్ బి12 ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి.
మాంసం చేప డైరీ ప్రొడక్ట్స్ మొదలైన వాటిలో విటమిన్ బి12 ఉంటుంది. ఈ విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా చేర్చుకుంటూ ఉండండి. విటమిన్ సి లోపం వలన కూడా బీపీ పెరుగుతుంది. విటమిన్ సి లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి మిమ్మల్ని రిలాక్స్డ్ గా ఉంచడానికి ఇవి సహాయం చేస్తాయి.
సిట్రస్ ఫ్రూట్స్ అయినటువంటి స్ట్రాబెర్రీ, కివి వంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది. అలానే బెల్ పెప్పర్స్ ఆకుకూరల్లో కూడా విటమిన్ సి దొరుకుతుంది. అదేవిధంగా మెగ్నీషియం లోపం వలన కూడా హై బీపీ రావచ్చు. మెగ్నీషియం ని కూడా డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. ఆకుకూరలు, నట్స్, గింజలు మొదలైన వాటిలో మెగ్నీషియం ఉంటుంది.
కేవలం బీపీ మాత్రమే కాదు పోషకాహార లోపం వలన రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి అన్ని రకాల పోషక పదార్థాలు అందేలా చూసుకుంటూ ఉండాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం రెగ్యులర్ గా వ్యాయామాలు చేయడం ఆరోగ్యకరమైన బరువుని కలిగి ఉండడం సోడియం ని తక్కువగా తీసుకోవడం ఒత్తిడి లేకుండా ఉండడం వంటి వాటి వల్ల కూడా బీపీ రాకుండా చూసుకోవచ్చు.