News

ఎట్టకేలకు బ్యూటీ సీక్రెట్‌ని బయటపెట్టిన బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌.

మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్‌ చేసుకుంటాను. ఇది మొహం మీది ముడతలను మాయం చేస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా.. నవ యవ్వనంగా ఉంచుతుంది. ఈ చిట్కాలతోపాటు రోజూ క్రమం తప్పకుండా డ్యాన్స్, యోగా, సైక్లింగ్‌ చేస్తాను. ఇవన్నీ మా అమ్మ చెప్పిన చిట్కాలే’ అని తన బ్యూటీ సీక్రెట్స్‌ను రివీల్‌ చేసింది హేమ మాలిని.

అయితే అలనాటి బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌ హేమమాలిని.. డెబ్బై పదుల వయసులోనూ ఆకర్షణీయమైన రూపంతో మెరిసిపోతున్నారు. 70వ దశకంలో బీ-టౌన్‌ ప్రేక్షకులను తన అందం, అభినయంతో మంత్రముగ్ధులను చేసిన ఆమె.. ఇప్పటికీ ‘తార’లా వెలిగిపోతున్నారు. అయితే, 74 ఏళ్ల వయసులోనూ తను ఇలా కనిపించడానికి కారణం అమ్మ చెప్పిన చిట్కాలే అంటూ తన బ్యూటీ సీక్రెట్‌ను ఇటీవల రివీల్‌ చేశారామె.

ఆవిడ ఏం చెప్పారంటే..”రోజూ ఉదయమే కొబ్బరి నీళ్లు తాగుతాను. వీలైనంత ఎక్కువగా మంచి నీళ్లూ తాగుతాను. అలాగే భోజనంలో పెరుగు తప్పకుండా ఉండాల్సిందే. వీటివల్ల చర్మం తేమను కోల్పోకుండా తాజాగా.. కాంతిమంతంగా ఉంటుంది. ఇవన్నీ మా అమ్మ చెప్పిన చిట్కాలే.

ఈ చిట్కాలతోపాటు రోజూ క్రమం తప్పకుండా డాన్స్, యోగా, సైక్లింగ్‌ చేస్తా. మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్‌ చేసుకుంటా. ఇది మొహం మీది ముడతలను మాయం చేసి చర్మాన్ని మృదువుగా.. యంగ్‌గా ఉంచుతుంది!” అని హేమమాలిని పేర్కొన్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించిన హేమమాలిని ప్రస్తుతం బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker