News

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్, హేమ ఉన్నారంటూ.. వీడియో రిలీజ్‌ చేసిన పోలీసులు..!

బెంగళూరులో ఓ వ్యక్తి బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. అయితే ఈ పార్టీకి దాదాపు 100 మందికి పైగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. అయితే రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. అయితే అయితే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫొటోలు రిలీజ్ చేశారు. రేవ్‌ పార్టీకి తాను వెళ్లలేదంటూ హేమ చేసిన వీడియోలో ఏ డ్రస్‌తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫొటోలోనూ అదే డ్రస్‌లో కనిపించారు. డ్రెస్‌ మ్యాచ్ అయింది. హేమ మాటలు తూచ్‌ అయ్యాయి. ఇది అబద్ధం నెంబర్‌ వన్‌.

ఇదెట్టా సాధ్యం అంటున్నారు జనం. బెంగళూరులో హైదరాబాద్‌లో ఒకే టైమ్‌లో ఒకే డ్రెస్సులో హేమ ఎట్టా కనిపిస్తారబ్బా.. ఆమె చెప్పింది అబద్ధం కాదా అంటున్నారు. ఇక, హైదరాబాద్‌ ఫామ్‌ హౌస్‌లో ఉన్నానంటూ హేమ రిలీజ్‌ చేసిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌ను కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. అక్కడ ఉన్న చెట్లు, హేమ వీడియో చేసిన చెట్టు.. బెంగళూరు ఫామ్‌హౌస్‌లో ఉంది. హైదరాబాద్‌లో కాదు. ఇక దీనితో పాటు కెమెరాను ఇంకాస్త పక్కకు తిప్పితే బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ సెట్టింగ్‌ కూడా కనిపిస్తుంది. ఇది చెవిలో పూలు కాదు…చెట్లు పెట్టడం అంటున్నారు బెంగళూరు పోలీసులు.

ఆమె హైదరాబాద్‌లో కాదు బెంగళూరులోనే ఉన్నారని అక్కడి పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇది హేమ చెప్పిన అబద్ధం నెంబర్ 2. ఇక రేవ్‌ పార్టీ గురించి మీడియా చెబితేనే, ఆ విషయం హేమ మేడమ్‌కి తెలిసిందిట. ఇది హేమ చెప్పిన మూడో అబద్ధం. కేసు లేదు గీసు లేదు. అసలు నన్ను ఎవ్వరూ పట్టుకోలేదు. ఇది కూడా హేమ చెప్పిన మాటే. ఇది హేమ చెప్పిన నాలుగో అబద్ధం. రేవ్‌ పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు విచారించారు. ఆ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఫామ్‌ హౌస్‌ గేటు నుంచి తెల్లటి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోతూ కనిపించింది.

ఇలా అబద్ధాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు గుర్రుగా ఉన్నారు. పోలీసుల కస్టడీలో ఉండి పక్కకు వెళ్లి వీడియో తీసి మీడియాకు పంపి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హేమపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. హేమ చర్యపై అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారని తెలుస్తోంది. రేవ్‌ పార్టీలో పాల్గొన్న హేమను ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు విచారించారు. ఇక గతంలోనూ అనేక వివాదాల్లో హేమ పేరు మార్మోగింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker