19 ఏళ్లకే ముస్లిం వ్యక్తితో నటి హేమ రిజిస్టర్ మ్యారేజ్, నటి హేమ లవ్ స్టోరీ తెలుసా..?
తెలుగు ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమ బాగా సుపరిచితం. 1989 నుంచి మొన్నటి వరకు సినిమాల్లో చాలా యాక్టివ్ గా కనిపించారు. తన కెరీర్ లో ఇప్పటివరకు 200కిపైగా సినిమాలు చేశారు. ఎన్నో సినిమాలు, విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి నటి హేమ పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.
1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. కాగా హేమ అసలు పేరు కృష్ణవేణి. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రాజోలుకి చెందిన వారు. హేమకి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ శ్రీదేవికి స్నేహితురాలుగా నటించారు. ఈ సినిమాతో హేమకి గుర్తింపు లభించింది.
నటి హేమ ప్రేమ విషయానికి వస్తే.. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. గతంలో ఓ ఇంటర్య్వూలో హేమ మాట్లాడుతూ.. నేను దూరదర్శన్ లో వర్క్ చేసినప్పుడు ఆయన పరిచయం అయ్యారు. అక్కడే తను కూడా అసిస్టెంట్ గా కెమెరా మెన్ గా పనిచేస్తూ ఉండేవారు.
ఓరోజు కలిసిన ఫస్ట్ మీటింగ్ లోనే జాన్ పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారు. అప్పుడు నా వయస్సు18 దాటుతోంది. కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మోసం చేసే వ్యక్తి కాదని అర్థమైంది. దీనికి హేమ ఎస్ చెప్పడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఈషా అనే కూతురు ఉంది.