News

ఓ వైపు క్యాన్సర్ బాధిస్తున్నా షూటింగ్‌లో పాల్గొన్న ప్రముఖ హీరోయిన్.

హీనా ఖాన్ తన రొమ్ము క్యాన్సర్ గురించి సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాదు క్యాన్సర్ మూడో స్టేజ్ కు చేరుకుందని తెలిపింది. ఇప్పుడు దాని నుండి పూర్తిగా కోలుకోవడం ఆమెకు సవాలుగా మారింది. కేన్సర్‌తో బాధపడుతూ కూడా ఆమె సినిమాలను వదలడం లేదు.. తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. అయితే బాలీవుడ్ బుల్లితెర హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీనా ఖాన్ ఇటీవల బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి భారిన పడ్డారు.

అయితే క్యాన్సర్ అనగానే మొదట ఎంతో భయం వేసిందని.. మానసికంగా కృంగిపోయానని కన్నీరు పెట్టుకుంది. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్యులు తనకు ఎంతో ధైర్యం చెప్పారని..ప్రస్తుతం క్యాన్సర్ ట్రీట్‌మెంట్ నడుస్తుందని తెలిపింది. ఇటీవల హీనా ఖాన్ కి మొదటి కీమో సెషన్ పూర్తయ్యిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె మళ్లీ షూటింగ్‌కి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో పాపులర్ టీవీ సీరియల్ ‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’ లో ఆమె అక్షర పాత్ర పోషించింది.

ఈ పాత్ర హీనా ఖాన్ కి ఎంతో పాపులారిటీ తెచ్చిపెట్టింది. బిగ్ బాస్, ఖత్రోన్ కె ఖిలాడీ వంటి రియాల్టీ షోలో పాల్గొంది. క్యాన్సర్ తో పోరాడుతూనే మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నా అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ‘నేను క్యాన్సర్ తో బాధపడుతున్నా.. అయినా కూడా మొక్కవోని దైర్యంతో ఉన్నా. నేను షూటింగ్ కి హాజరయ్యాను. చెడు రోజులు తక్కవగా ఉన్నా.. సంతోషంగా గడపడం మర్చిపోవొద్దు. మనకు వచ్చే కష్టాలను పెద్దగా చూడొద్దు.

ఇప్పుడున్నవి ముఖ్యమైన రోజులు.. మార్పును అంగీకరిస్తూ..గతంలో మాదిరిగా ప్రయత్నించాలి.’ అంటూ ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధితో పోరాడుతూ ఆమె మనోధైర్యానికి మెచ్చుకోవచ్చు అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker