హార్ట్ పేషంట్స్ ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు మీ కోసమే.
మీరు మొదటి సారి నవరాత్రి ఉపవాసం ఉంటుంటే.. నెమ్మది.. నెమ్మదిగా ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మీరు చేస్తున్న మార్పులను అర్థం చేసుకోవడానికి, దానికి సర్దుబాటు అవ్వడానికి మీ శరీరానికి కొంత సమయం కావాల్సి ఉంటుంది. కొంతమంది.. ఉపవాస దీక్ష సమయంలో ‘నిర్జల వ్రతం’ చేస్తూ ఉంటారు. ఇలాంటి కఠినమైన ఉపవాసాల కారణంగా మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.
అలాగే, శరీరంలో మలినాలు, వ్యర్థాలు పేరుకుపోతాయి. మీ ఉపవాస దీక్ష సమయంలో పాలు, పండ్లు తీసుకుంటూ ఉండండి. అయితే ఉపవాసం ఉండటం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. రక్త పోటు తగ్గుతుంది. హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. ఉపవాస సమయంలో సాధారణమైన భోజనం మానేయడం వల్ల డీ హైడ్రేషన్ కు గురవుతారు. దీని వల్ల గుండె సమస్యలు తీవ్ర తరం అవుతాయి. గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఉపవాసం అస్సలు ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆహార విషయాల్లో ఆకస్మికంగా మార్పులు రావడం వల్ల శరీరంలో అనే మార్పులు చేర్పులు జరుగుతాయి. గుండెల్లో మంట, కడుపులో మంట, నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, జీర్ణ సమస్యలు, డీ హైడ్రేషన్ కు గురి కావడం, రోగ నిరోధక శక్తి తగ్గడం ఇలా అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి ఉపవాసం ఉండి కొన్ని రకాలైన ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె పలు రకాల ఇబ్బందులకు గురి అవుతుంది. రక్త ప్రసరణలో మార్పులు, సోడియం స్థాయిలలో చేంజ్ కారణంగా హృదయ నాళ వ్యవస్థను దెబ్బ తీస్తాయి.
దీంతో గుండె లయలో మార్పులు వస్తాయి. ఈ ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఒక వేళ గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఉపవాసం ఉండాలనుకుంటే కొన్ని రకాల చిట్కాలు పాటించాలి. వీటి వల్ల సమస్యలు కాస్త తగ్గించుకోవచ్చు. హార్ట్ పేషంట్స్ ఉపవాసం ఉండాలంటే చిట్కాలు:- కొన్ని రకాల జ్యూస్ లు లేదా మజ్జిగ, నీరు, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి.
పండ్లు, కూరగాయలు, గింజలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని కలిగి ఉన్న సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీని వల్ల శక్తి లభిస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందించడంలో సహాయ పడతాయి. బ్లడ్ లో షుగర్ లెవల్స్ కూడా పెరగవు. తేలిక పాటి వ్యాయామాలు చేయాలి. ఇవి ఎనర్జీ లెవల్స్ ను నిర్వహించడంలో హెల్ప్ చేస్తాయి. ఉపవాస సమయంలో తీవ్రమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలి.