Health

శుభవార్త చెప్పిన సైంటిస్టులు, గుండెపోటుతో చనిపోయిన వారిని మళ్ళీ బతికించవచ్చు.

గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. అయితే ఏ వ్యక్తికైనా సరే.. హార్ట్ ఎటాక్ సంభవించినప్పుడు వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తరలించాలి.

దీంతో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో బాధితులను హాస్పిటల్‌కు తరలించడం ఆలస్యం అవుతుంటుంది. అలాగే పలు ఇతర కారణాల వల్ల కూడా ఆలస్యం అవుతుంది. దీంతో సకాలంలో చికిత్సనందించడం కుదరదు. ఈ క్రమంలో రోగి హార్ట్ ఎటాక్‌తో చనిపోతాడు. అయితే ఇకపై ఆ బాధ ఉండబోదు. అవును, మీరు విన్నది నిజమే.

హార్ట్ ఎటాక్‌తో ఇకపై ఎవరైనా చనిపోయినా.. వారిని బతికించేందుకు వీలు కలుగుతుందట. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. కేంబ్రిడ్జి పరిశోధకులు గుండె జబ్బులను నివారించడంలో తాజాగా అద్భుతమైన విజయం సాధించారు. హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయిన గుండె రక్తనాళాలు, గుండె కణజాలానికి వారు తిరిగి ప్రాణం పోశారు. గుండెపోటు వచ్చినప్పుడు సహజంగానే గుండె కణజాలానికి ఆక్సిజన్ అందదు. దీంతో గుండెలోని కొన్ని ప్రాంతాలు దెబ్బ తింటాయి.

అక్కడి కణజాలం నాశనమవుతుంది. తిరిగి అది పునర్నిర్మాణం చెందలేదు. దీంతో వ్యక్తి చనిపోతాడు. అయితే ఆ నాశనమయ్యే కణజాలానికి సైంటిస్టులు జీవం పోశారు. కేంబ్రిడ్జి పరిశోధకులు మానవ గుండెలో నుంచి రెండు రకాల స్టెమ్ సెల్స్‌ను తీసుకుని వాటిని ఎలుకలలోని చనిపోయిన గుండె కణజాలంలోకి ఎక్కించారు. అనంతరం వాటిని ల్యాబ్‌లో పెంచారు. ఈ క్రమంలో పెరిగిన కణజాలాన్ని తీసుకెళ్లి తిరిగి ఎలుక గుండెల్లోకి ఎక్కించారు. అయితే ఆశ్చర్యంగా అప్పటికే చనిపోయిన ఎలుకల గుండెలోని కణజాలం తిరిగి జీవం పోసుకుంది.

దీంతో ఈ ప్రయోగాన్ని మనుషుల గుండెలపై చేయడమే తరువాయి అని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ ప్రయోగం మనుషులపై చేస్తే అది సక్సెస్ అయితే గుండె జబ్బుల బాధితులకు అది వరమవుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే గుండెపోటు వల్ల చనిపోయిన గుండె కణజాలాన్ని తిరిగి బతికిస్తారు. దాంతో గుండె తిరిగి పనిచేస్తుంది. అంటే.. చనిపోయిన వారిని బతికించినట్లే అవుతుంది కదా. మరి సైంటిస్టులు ఈ విషయంలో ముందడుగు వేస్తారో లేదో చూడాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker