జీవితంలో గుండె పోటు, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోండి.
మనం తీసుకునే ఆహారమే ఈ గుండెజబ్బులకు కారణం కావచ్చు. జంక్ పుడ్, అయిల్ పుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మీరు సరైన ఆహారం తీసుకోకపోతే గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ మరియు ట్రిపుల్ వెసెల్ డిసీజ్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. దీనికి కారణాలు కూడా ఉన్నాయి.
మనం తీసుకునే ఆహారమే మనకు సమస్యలు తెచ్చిపెడుతోంది. అయినా మనం లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో గుండె జబ్బు ముప్పు పాతికేళ్లకే పలకరిస్తోంది. దీంతో జీవితాంతం మందులు వాడే పరిస్థితి దాపురిస్తోంది. హృద్రోగ సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. పూర్వ కాలంలో డెబ్బయ్యేళ్లకు కానీ గుండె జబ్బులు వచ్చేవి కావు. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు గుండె జబ్బుల ప్రమాదం అందరిని బాధిస్తోంది.
ప్రస్తుతం కాలం మారింది. జబ్బులు కూడా మారుతున్నాయి. దాదాపు నూటయాభై ఏళ్లు బతకాల్సిన గుండెకు చిల్లులు పడుతుండటంతో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు కూరుకుపోవడంతో గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. దీంతో అవి సక్రమంగా పనిచేసేందుకు స్టంట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గుండె జబ్బు నుంచి ఉపశమనం కలిగించే ఎన్నో మందులు ఉన్నాయి. కానీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోం.
గుండె జబ్బుల బారి నుంచి రక్షణ పొందడానికి కొన్ని చర్యలు తీసుకుంటే మంచిది. లేకపోతే గుండె పనితీరు మందగిస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో అన్ని అవయవాలకు రక్తం సరఫరా చేసే అవయవం గుండె. అందుకే గుండెను సురక్షితంగా కాపాడుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. గుండె పని బాగుండాలంటే ఆయుర్వేదంలో మనకు ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. గుండెకు మంచి చేసే వాటిలో త్రిఫల చూర్ణం, అర్జున, అతిబల పొడులు ఎంతో ఉపయోగపడతాయి. వీటితో గుండె పనితీరు మెరుగుపడుతుంది.
రక్తనాళాలు మూసుకుపోయినా వీటిని తీసుకుంటే ఎన్నో ఫలితాలు కనిపిస్తాయి. త్రిఫల చూర్ణం ఒక చెంచా, అర్జున చూర్ణం ఒక చెంచా, అతిబల చూర్ణం ఒక చెంచా తీసుకుని వాటిని ఒక గ్లాసులో వేసి కలుపుకుని నీరు పోసుకుని తాగితే ప్రయోజనాలు ఉంటాయి. రోజుకు మూడు పూటలు ఈ ద్రావణం తీసుకోవడం వల్ల గుండెకు లాభం కలుగుతుంది.