మీ గుండె ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ చెప్పిన విషయాలు ఇవే.
అలసట, ఒత్తిడి కారణంగా గుండె వైఫల్యం. గుండెపోటు వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ రోజుల్లో గుండె జబ్బులతో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుతో చనిపోయిన వారు మన చుట్టూ చాలామంది ఉన్నారు.
మనం కూడా గుండెపోటుతో చనిపోతామేమో అని భయపడుతున్నాం కానీ అసలు గుండె ఆరోగ్యం గా ఉండాలంటే ఏం చేయాలి, గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం డాక్టర్లు ఏం చేస్తున్నారో వినండి. ముందుగా ధూమపానం అలవాటు ఉన్నవారు అర్జెంటుగా అలవాటుని మానుకోండి. ధూమపానం వలన ఆర్టెరీస్ బ్లాక్ అవుతాయి. దీనివలన కార్డియాక్ అరెస్టు సంభవిస్తుంది.
కాబట్టి అసలు ధూమపానం జోలికి పోకండి. అలాగే ఒత్తిడి కూడా గుండె జబ్బులకి ప్రధాన కారణం అంటున్నారు డాక్టర్లు. కాబట్టి ఒత్తిడిని మేనేజ్ చేసుకునే విధానాలు తెలుసుకోండి. యోగా, మెడిటేషన్ సాధన చేయండి. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి గుండెపైన ప్రభావం చూపిస్తాయి అంటున్నారు డాక్టర్లు. బ్లడ్ వెజిల్స్ పనితీరులో ఇబ్బందులను ఈ కాంప్లికేషన్స్ పెంచుతాయి.
కాబట్టి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు గుండె ఆరోగ్యం పై శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. షుగర్ ఉన్నవాళ్లు గుండె ఆరోగ్యం మీద మరింత ఎక్కువ శ్రద్ధ కట్టాలి ఎందుకంటే గుండెపోటుకి ప్రధాని శత్రువు షుగర్. శరీరంలోని అధిక కొవ్వు వలన కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులు తలెత్తుతాయని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
నేను సన్నగా ఉన్నాను కాబట్టే నాకు గుండెపోటు రాదు అనే అపోహని పక్కన పెట్టండి. అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్, గుండె జబ్బులు కలిగిన వంశ చరిత్ర, లేదంటే పుట్టుకతోనే వచ్చిన గుండె జబ్బుల వలన సన్నగా ఉన్నా సరే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి సన్నగా ఉన్నానని గుండె ఆరోగ్య మీద అశ్రద్ధ వహించకండి.