Health

గుండెల్లో మంట ఎంతకీ తగ్గడం లేదా..? మీరు వెంటనే చెయ్యాల్సిన పని ఇదే.

చిన్న.. పెద్ద తేడా లేకుండా గుండెల్లో మంట.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయి. కొన్నిసార్లు మనం తీసుకునే ఆహరం వలన కూడా గుండెల్లో మంట కలుగుతుంది. ఇక తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయిన గుండెలో మంట వస్తుంది.. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకున్న గుండెలో ఏర్పడుతుంది. అయితే గుండెల్లో మంట రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్ ను తాగడం, తిన్న వెంటనే పడుకోవడం లేదా బాగా కారంగా ఉన్న ఆహారాలను తినడం వల్ల ఛాతీలో మంట కలుగుతుంది. రోజూ శారీరక శ్రమ చేస్తూ.. మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటే ఈ సమస్య కొంతవరకు తగ్గుతుంది. సోంపు నీరు.. సోంపు నీరు కూడా ఎసిడిటీ లక్షణాలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

ఇందుకోసం గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ సోంపు గింజలను కలిపి తాగితే గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లం.. బెల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. బెల్లంగా మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. పీహెచ్ సమతుల్యతను నిర్వహించడానికి పొటాషియం బాగా సహాయపడుతుంది. అలాగే దీనిలో ఉండే మెగ్నీషియం జీర్ణవ్యవస్థ సరిగ్గా సహాయపడుతుంది.

అందుకే గుండెల్లో మంటగా ఉన్నప్పుడు చిన్న బెల్లం ముక్కను నోట్లో పెట్టుకోండి. నల్ల జీలకర్ర..గుండెల్లో మంటను తగ్గించేందుకు జీలకర్ర కూడా మీకు సహాయపడుతుంది. ఇలాంటిప్పుడు మీరు కొన్ని జీలకర్ర గింజలను తీసుకుని నమలొచ్చు. లేదా ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ జీలకర్ర వేసి మరిగించి తాగొచ్చు.

ఇలా చేయడం వల్ల గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. అజ్వైన్.. అజ్వైన్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది గుండెల్లో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి దీనిని ఎఫెక్టివ్ యాంటీ అసిడిక్ ఏజెంట్ అంటారు. గుండెల్లో మంటను తగ్గించుకోవడానికి మీరు అజ్వైన్ వాటర్ ను తాగొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker