అప్పుడప్పుడు గుండెల్లో మంట వస్తోందా..? అది దేనికీ సంకేతమో తెలుసా..?
నిజానికి హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి అది హార్ట్ ఎటాక్ అని తెలియదు. లక్షణాలపై అవగాహన లేకపోవడంతో, వచ్చింది హార్ట్ ఎటాక్ అని గుర్తించలేరు. జాప్యం చేస్తే ప్రాణానికి ముప్పు ఏర్పడుతుంది. వెంటనే వైద్యం అంది ప్రాణాలతో బయటపడే వారు ఎందరో ఉంటారు. అయితే ఒక్కొక్కసారి కొందరికి గుండెల్లో మంట వస్తూ ఉంటుంది.
గుండెలో మంట వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అలా రాకూడదు. అసలు ఎందుకు గుండెలో మంట వస్తుంది దాని వల్ల ఏమవుతుంది అనే విషయాలను తెలుసుకుందాం. గుండెలో మంట రావడం వెనుక వివిధ కారణాలు వున్నాయి. ఆరోగ్య నిపుణులు మనతో ఆ విషయాలను చెప్పారు.
మంచి ఆహారం తీసుకోకపోతే గుండెలో మంట వస్తుంది బాగా కారంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే గుండెలో మంట వస్తుంది. చాలామంది బయట ఫుడ్ ని తీసుకుంటూ ఉంటారు బయట చేసిన బర్గర్లు, పిజ్జాలు వంటివి తింటే కూడా గుండెల్లో మంట వస్తుంది కాబట్టి అలాంటి వాటిని తినకండి. గుండెలో మంట వస్తున్నట్లయితే అస్సలు వీటి జోలికి వెళ్ళకండి.
చాలామంది స్మోక్ చేస్తూ ఉంటారు. స్మోక్ చేసే వాళ్ళల్లో కూడా గుండెల్లో మంట వస్తుంది. సిగరెట్ పొగ వలన గుండెలో మంట కలుగుతుంది కాబట్టి అలాంటి అలవాట్ల కి దూరంగా ఉండటం మంచిది ఒత్తిడి వలన కూడా గుండెలో మంట వస్తుంది. ఒత్తిడి కలగడం వలన పానిక్ ఎటాక్ వంటివి వచ్చే రిస్కు ఉంది ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండాలి.
హృదయ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చాలా మంది ఈ రోజుల్లో హృదయపూర్వక సమస్యలతో బాధపడుతున్నారు సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా ఉండడం ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యం లేకపోతే అనవసరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.