గుండెపోటుతో మరణించేవారిలో అత్యధికులు ఇలాంటివారే. విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి..?
సిరలు, ధమనుల లోపల గడ్డలు ఏర్పరుస్తాయి. సిరలు, ధమనుల గడ్డకట్టడం, అడ్డంకలు ఏర్పడటం వల్ల గుండెపోటు, ఆకస్మిక మరణానికి దారి తీస్తుంది. పొగాకు మూలంగా రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి. దీంతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే సమస్యలు వేగంగా వ్యాపిస్తున్నాయి. చిన్న వయసులోనే చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఆధునిక జీవనశైలి పాటించేవారిలోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కాబట్టి తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆనారోగ్యకరమైన ఆహారాలకు కూడా తినకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గుండెపోటు వల్ల ఏటా ఎంత మంది మరణిస్తున్నారో తెలుసా..?భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్ష మందిలో 272 మంది గుండెపోటు కారణంగా మరణిస్తున్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి.
ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే గసటు ఒక లక్ష జనానికి 235 మంచి ఈ వ్యాధులతో చనిపోతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీరిలో 8 నుంచి 9 శాతం మంది గుండెపోటు వచ్చిన 30 నుంచి 40 రోజుల తర్వాత కాలం చేస్తున్నారట. ఈ నివేదికలే కాకుండా బయట నివేదికల ప్రకారం.. చాలా మంది గుండె సమస్యల బారిన పడి ఇతర అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారని తెలుస్తోంది.
సిగరెట్ వల్లేనా గుండెపోటు..సిగరెట్ తాగడం వల్ల గుండెపోటు సమస్యలు సులభంగా వస్తాయి. వాటి నుంచి వచ్చే పొగ పీల్చుకోవడం వల్ల కూడా చాలా మంది తీవ్ర గుండెపోటుకు గురవుతున్నారని నివేదికల్లో తెలింది. కాబట్టి ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి ధూమపానం మానుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మానుకోవడం వల్ల కొంత మేరైనా గుండెపోటు ముప్పు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పరిశోధనలో విస్తుగొలిపే నిజాలు.. న్యూయార్క్‌లోని ప్రెస్‌బిటేరియన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ జె. మిన్ తెలిపిన వివరాల ప్రకారం..స్మోకింగ్ చేయడం వల్ల సులభంగా గుండె జబ్బులు వస్తాయని దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చని తెలిపారు. ధూమపానం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని, ఇలాంటి అలవాట్లు ఉన్నవారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మానుకోవాలని ఆయున సూచించారు.