Health

గుండె పోటు వచ్చే ముందు రోజు కపించే లక్షణాలు ఇవే. నిర్లక్ష్యం చెయ్యకుండా..?

ఏదో ఒక పనిచేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. వ్యాయమం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్టే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. పట్టరాని ఆనందం వచ్చినా, భయాందోళలకు గురైనా గుండె కొట్టుకునే వేగం పెరగడం సాధారణం. కానీ ఏ కారణం లేకుండానే కేవలం కొన్ని సెకన్ల పాటు గుండే వేగంగా కొట్టుకోవడం, తరుచూ అలా జరగడం గుండెపోటు లక్షణం అని వైద్యులు చెబుతున్నారు.

జీవితపు ప్రతి దశలో ప్రమాదాలు ఉండనే ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకే జీవితంలో చాలా అప్రమత్తత అవసరం. లేకపోతే ఎప్పుడు ఎలా ఉంటుందో..ఏమౌతుందో ఎవరూ చెప్పలేరు. గుండెపోటు కూడా అటువంటిదే. ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అయితే..జీవితంలో కొన్ని తప్పులు, కొన్ని ఒప్పులు ఎప్పుడూ వివిధ రకాలుగా సంకేతాలిస్తూనే ఉంటాయి. గుండెపోటు వచ్చేముందు కూడా మన శరీరం కొన్ని రకాల సంకేతాల్ని ఇస్తుంది.

హార్ట్ ఎటాక్‌కు ముందు సంకేతాలు..నిద్రలో అసౌకర్యం అనేది సామాన్యమైన లక్షణం. ఒకవేళ మీ హార్ట్ బ్లాకేజ్ అవుతుంటే లేదా గుండెపై ఒత్తిడి పెరుగుతుంటే లేదా పట్టేసినట్టుంటే ఆ సంకేతాల్ని వెంటనే పసిగట్టాలి. ఈ సమస్య ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా అనుభవం ఉంటుంది. కొందరికి ఛాతీ బరువుగా ఉన్నట్టుంటుంది. చాలా బరువుగా అనుభవమౌతుంటుంది. ఇంకొంతమందికి ఛాతీలో గుచ్చినట్టుంటుంది. మరి కొందరికి ఛాతీలో మంట ఉంటుంది. శ్వాసలో ఇబ్బంది, కొందరికి శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది.

ఎలా ఉంటుందంటే..రోజుకు 2-3 అంతస్థులు ఎక్కి దిగినా లేని ఇబ్బంది సాధారణ సమయాల్లో వచ్చిందంటే హార్ట్ ఎటాక్ లక్షణంగా భావించాలి. గుండె సంబంధిత వ్యాధుల లక్షణాలు ఒక్కోసారి ఇతర అనారోగ్య సమస్యలున్నప్పుడు కూడా కన్పిస్తుంటాయి. అందుకే వైద్యుడిని సంప్రదిస్తే సమస్యేంటనేది నిర్ధారణౌతుంది. వాంతులు వచ్చినా లేదా తల తిరుగుతున్నా హార్ట్ ఎటాక్ లక్షణం కావచ్చు. గొంతులో నొప్పి..గొంతులో లేదా దవడలో నొప్పిగా ఉంటే గుండె నొప్పి కావచ్చు కానీ నూటికి నూరుశాతం కాదు. అదే సమయంలో గుండె మధ్యలో ఒత్తిడిగా ఉంటే హార్ట్ ఎటాక్ లక్షణమే అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker