Health

గుండె పోటు వచ్చే ముందు మొదట కనిపించే సంకేతం ఇదే.

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అయితే గుండెపోటు సంభవించే ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యాం ఉంటుంది.

ఇది కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటుంది. గుండె ప్రాంతంలో ఒత్తిడి, తిమ్మిరి లేదా నొప్పి గుండెపోటుకు ప్రారంభ సంకేతంగా చెప్పవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, గుండెపోటు లక్షణాలు పురుషులు ,స్త్రీల మధ్య విభిన్నంగా ఉంటాయి. పురుషుల మాదిరిగానే స్త్రీలు సాధారణ ఛాతీ నొప్పితో బాధపడవచ్చు. శ్వాస ఆడకపోవడం, వికారం, వాంతులు, వెన్ను లేదా దవడ నొప్పి వంటి పురుషుల కంటే స్త్రీలు చాలా సాధారణ లక్షణాలను కలిగి ఉంటారు. చెవి పోటు లక్షణాల ద్వారా గుండెపోటును గుర్తించవచ్చు.

దీన్నే ఫ్రాంక్ స్ సైన్’ అని పిలుస్తారు, ఇది గుండె జబ్బులతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దవడ, మెడ, డైజెస్టివ్ సిస్టంలో నొప్పి కలగడం లాంటి లక్షణాలు కూడా గుండె పోటు యొక్క లక్షణాలు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 55 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం, మధుమేహం , జీవక్రియ లోపాలు వంటి సమస్యలు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

ఛాతిలో విపరీతమైన నొప్పి ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి. చాలామంది ఇది ఎసిడిటీ ఏమో అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి గుండె పోటు వచ్చే ముందు కూడా ఛాతిలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. అలానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినా సరే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించటం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఇతర ఆరోగ్య జాగ్రతల వల్ల గుండె జబ్బుల ప్రమాదం నుండి బయటపడవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker