అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే గంట ముందు కనిపించే లక్షణలు ఇవే.
ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు మనం పోరాడతాం లేదా పారిపోతాం. అది శరీరపు సహజ స్పందన. అలాంటి సందర్భాల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగవంతమవుతుంది. పానిక్ అటాక్స్‌లో కూడా అలాంటి ప్రతిచర్యలే జరుగుతాయి. స్పష్టమైన ప్రమాదం లేకున్నా అలా ఎటాక్స్ ఎందుకు వస్తాయో కారణాలు తెలియవు. కానీ జీన్స్, ఒత్తిడి, ఒత్తిడి వల్ల తీవ్ర ప్రతికూల భావోద్వేగాలకు గురయ్యే స్వభావం, మెదడులోని భాగాల పనితీరులో మార్పులు కారకాలుగా గుర్తించారు. అయితే కార్డియాక్ అరెస్ట్ ముందస్తు ఎటువంటి సంకేతాలు, లక్షణాలు లేకుండా వచ్చేస్తుంది.
కార్డియాక్ అరెస్ట్ వల్ల గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు రక్తాన్ని పంప్ చేయడం ఆపేస్తుంది. కణాలకు అవసరమైన ఆక్సిజన్ చేరుకోదు. ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల వల్ల నిమిషాల్లోనే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అటువంటి సమయంలో తక్షణమే వైద్య సాయం అందాలి. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన తర్వాత రోగి స్పృహ కోల్పోతాడు. మెదడు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు రక్తప్రసరణ ఆగిపోతుంది. ఎక్కువ కేసుల్లో కార్డియాక్ అరెస్ట్ రావడానికి కారణం అరిథ్మియాస్. కరొనరీ హార్ట్ డిసీజ్, విపరీతమైన శారీరక శ్రమ కూడా కొన్ని సార్లు దీనికి కారణం అవుతుంది.
సీపీఆర్ రివర్స్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు రోగికి చేస్తే కొంతవరకు ప్రాణాలు కాపాడవచ్చు. ఎక్కువ శాతం కార్డియాక్ అరెస్ట్ కేసుల్లో ఎటువంటి ముందస్తు లక్షణాలు లేవు. కానీ కొన్ని సార్లు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..స్పృహ కోల్పోవడం, ఉన్నట్టుండి పడిపోవడం, పల్స్, శ్వాస లేకపోవడం, తీవ్రమైన ఛాతీ నొప్పి, మైకం, పొట్టలో అనారోగ్యం, వాంతులు కావడం. కార్డియాక్ అరెస్ట్ అని చెప్పడం ఎలా.. గుండె ప్రమాదకరంగా వేగంగా కొట్టుకోవడం, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్, అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ రావడానికి కారణాలు..
కరొనరీ హార్ట్ డిసీజ్, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, గుండె నిర్మాణంలో మార్పులు, విపరీతమైన శారీరక శ్రమ, మద్యపానం, ఊబకాయం, గుండెకి సంబంధించిన రుగ్మతలు.. కార్డియాక్ అరెస్ట్ వస్తే ఏం జరుగుతుంది.. ఎక్కువ కేసుల్లో ప్రాణ నష్టం జరుగుతుంది. ఇది వచ్చిన తర్వాత బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గుండెపోటు వచ్చిన మొదటి ఆరు నెలల్లో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోయే వారిలో 75 శాతం మంది తొలుత గుండెపోటుకు గురైన వాళ్ళు ఉంటున్నారు. ఇక కరోనరీ ఆర్టరీ వ్యాధి కారణంగా 80 శాతం మరణాలు దీనితో ముడి పడి ఉంటున్నాయి.
గుండె వైఫల్యం కేసుల్లో కూడా ఆకస్మిన్ కార్డియాక్ అరెస్ట్ జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. డైలేటెడ్ కార్డియోమయోపతి (సుమారు 10 శాతం ఆకస్మిక గుండె మరణాలకు కారణమవుతుంది) మరొక కారణం. రక్తంలో పొటాషియం, మెగ్నీషియం స్థాయిల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఊబకాయం, మధుమేహం, ఎక్కువగా మందులు ఉపయోగించడం వంటివి చేసినప్పుడు కూడా కార్డియాక్ అరెస్ట్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇలా నిర్ధారిస్తారు, శ్వాస తీసుకోకపోవడం, పల్స్ లేకపోవడం, స్పృహలో లేకపోతే మాత్రం సదరు వ్యక్తి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారిన పడినట్టు వైద్యులు నిర్ధారిస్తారు.