నైట్ డ్యూటీ చేస్తున్నారా..? ఎన్ని అనారోగ్య సమ్యలు వస్తాయో తెలుసా..?
కరోనా అనంతరం చాలామంది వర్క్ ఫ్రం హోం పేరిట నైట్ డ్యూటీ లు చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో డ్యూటీలు చేసే వారికి గుండె సమస్యలు అలాగే డయాబెటిస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇటీవల జరిగిన ఒక అధ్యయనం లో వెల్లడయింది.అమెరికాకు చెందిన టారో వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కొన్ని షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. అయితే సాధారణంగా రాత్రివేళల్లో ఉద్యోగాలు చేసేవారిలో ఎక్కువ శాతం నిద్రలేమి సమస్యలతో పాటు మెటాబాలిక్ సిండ్రోమ్ సమస్య పెరుగుతుందని అన్నారు.
వారంలో ఎవరైతే ఎక్కువ రోజులు రెగ్యులర్ గా నైట్ షిఫ్ట్ చేయడం లేదా తరచూ షిప్ట్ లు మారేవారిలోనూ ఈ సమస్య అధికంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయానాన్ని ది జనరల్ ఆఫ్ ది అమెరికన్ ఒస్టోపాతిక్ అసోసియేషన్ లో ప్రచురించారు. మన ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం, సామాజిక భద్రతంతా ఎక్కువగా నైట్ షిప్ట్ చేసే ఉద్యోగులపైనే ఆధారపడి ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో పనిచేసేవారిలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికాలోని టౌరో యూనివర్శిటీ నుంచి భారత సంతతి రీసెర్చర్ కష్మా కులకర్ణి ఆందోళన వ్యక్తం చేశారు. నైట్ షిప్ట్ చేసే నర్సుల్లో 9 శాతం మందిలో ఈ మెటాబాలిక్ సిండ్రోమ్ సమస్య అధికంగా ఉన్నట్టు తమ అధ్యయనంలో గుర్తించినట్టు తెలిపారు. డే షిప్ట్ నర్సులతో పోలిస్తే వారిలో 1.8 శాతం మాత్రమే ఉందని అన్నారు. ఇతర అధ్యయనాలను పరిశీలిస్తే.. ఏళ్ల తరబడి నైట్ షిప్ట్ చేసేవారిలో నెమ్మదిగా హెల్త్ రిస్క్ పెరిగిపోతున్నట్టు తమ పరిశోధనలో తేలిందన్నారు.
రోజుకు 24 గంటలు.. ప్రతిఒక్కరూ రోజులో కనీసం 7-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. పగలు సమయంలో ఎక్కువ సేపు నిద్రపోయినా దాని ప్రభావం పెద్దగా ఉండదని, రాత్రి వేళల్లో నిద్రపోతేనే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. అలసటను నివారించేందుకు రోజులో 20 నుంచి 120 నిమిషాలు అదనంగా నిద్రపోవాలని సూచిస్తున్నారు. జనరల్ షిఫ్ట్ చేసేవారంతా సూర్యుని కాంతి పడటంతో ఆ రోజుంతా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారని, అదే నైట్ షిప్ట్ చేసేవారిలో అది లభించకపోవడంతో లేచినదగ్గర నుంచి నిరూత్సహాంగా అలసటగా కనిపిస్తారని తెలిపారు.
షిఫ్ట్ వర్కర్లు ఎక్కువగా షుగర్ ఉన్న స్నాక్స్ ఎక్కువగా తీసుకుంటారని పరిశోధనలు చెబుతున్నాయని, అది ప్యాట్ మారిపోతుందని, తక్కువ ప్రొటీన్లు, కూరగాయలు తీసుకోరు.. జంకు ఫుడ్ తినడం ద్వారా మీల్స్ కూడా స్కిప్ చేసేస్తారని పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. నిద్ర సరిగా లేకపోవడం, సరిగా తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం ఆరోగ్యానికి తీవ్ర హనికరమనే విషయాన్ని గుర్తించాలని కులకర్ణి సూచిస్తున్నారు.