ఈ హోం రెమెడీస్ తో తొలనొప్పిని సులభంగా తగ్గిపోతుంది.
చాలామంది తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం మందులు తీసుకుంటారు. అయితే, మాత్రాలు అప్పటికప్పుడు ఉపశమనం కలిగించినా.. సమస్య మాత్రం పూర్తిగా తొలగిపోదు. పైగా అతిగా మాత్రలు మింగడం ఆరోగ్యానికి హానికరం కూడా. అందుకే, తలనొప్పిని తగ్గించడం కోసం చైనీయులు అనేక పద్ధతులు పాటిస్తున్నారు. అయితే రోజువారీగా లేదా తరచుగా ఇలా తలనొప్పి మాత్రలు వాడటం వలన అవి మెదడు పనితీరును ఆటంక పరుస్తాయి. ఇవి నాడీ వ్యవస్థకు నొప్పి సందేశాల ప్రవాహాన్ని నియంత్రిస్తాయి.
తలనొప్పి నివారణకు సహజ మార్గాలు.. శీతాకాలంలో చల్లని గాలి చెవుల్లోకి ప్రవేశించినపుడు కూడా తలనొప్పి కలుగుతుంది. మరి కారణం ఏదైతేనేం, తరచుగా ఇబ్బందిపెట్టే తలనొప్పిని ఎదుర్కోవటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి, అవి తలనొప్పిని నుంచి సులభంగా, సహజంగా ఉపశమనం కలిగిస్తాయి. మరి తలనొప్పిని నివారించే ఇంటి ఔషధాలను ఇక్కడ తెలుసుకోండి. లవంగాలు.. తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందేందుకు లవంగం ఒక నేచురల్ హోం రెమెడీ.
కొన్ని లవంగాలను చూర్ణం చేసి శుభ్రమైన రుమాలులో ఉంచండి. మీకు తలనొప్పి వచ్చినప్పుడల్లా, నొప్పి నుండి కొంత ఉపశమనం పొందే వరకు లవంగాల చూర్ణం వాసనను పీలుస్తూ ఉండండి. అలాగే గోరువెచ్చని పాలలో లవంగాలు, కొంచెం ఉప్పు వేసుకొని తాగినా ఉపశమనం కలుగుతుంది. దాల్చిన చెక్క.. దాల్చిన చెక్క పోపుల పెట్టెలో కనిపించే ఒక సాధారణమైన సుగంధ దినుసు. ఇది ఆహారానికి మంచి రుచిని, సువాసనను జోడించగలదు. తలనొప్పి నివారణకు కూడా ఔషధంగా పనిచేస్తుంది.
దాల్చినచెక్కను తురిమి, నీటిని కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ చూర్ణంను నుదిటిపై రోజుకు 3 నుండి 4 సార్లు వర్తించండి, తలనొప్పి తగ్గుతుంది. దాల్చినచెక్క టీలో కలుపుకొని తాగినా ప్రయోజనం ఉంటుంది. తులసి..భారతీయ ఇళ్లలో తులసిని పూజిస్తారు. అదే సమయంలో తులసిలోని ఔషధ గుణాల కారణంగా, దీనిని అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. తులసి నూనె అనాల్జేసిక్ లేదా పెయిన్ కిల్లర్‌గా సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది.
ఈ హెర్బ్ కండరాలను సడలిస్తుంది, ఒత్తిడి, బిగుతు కండరాల వల్ల కలిగే తలనొప్పిని నివారిస్తుంది. తలనొప్పిని వదిలించుకోవడానికి తులసి టీ కూడా అద్భుతమైనది. పసుపు.. తలనొప్పి నివారణకు పసుపు మరొక హోం రెమెడీ. తాజా పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మైగ్రేన్ దాడుల ఫ్రీక్వెన్సీని, తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు పాలలో ఒక కొద్దిగా తాజా పసుపు వేసి కాసేపు మరిగించాలి. ఆపై వడకట్టి గోరువెచ్చగా తాగాలి, తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.